CM Jagan: ముఖ్యమంత్రి జగన్ బాధ వెనుక అసలు కథ ఇదేనా?

CM Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో భాగంగా గెలుపొందడం కోసం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే గతంలో తన పార్టీపై ప్రజలపై ఎంతో నమ్మకం ఉన్నటువంటి జగన్ ప్రతిపక్ష నేతలు తమ వెంట్రుక కూడా పీకలేరని వచ్చే ఎన్నికలలో 175 స్థానాలలోనూ తమ జెండా ఎగురుతుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు.అయితే ప్రస్తుతం జగన్ లో కూడా తన పార్టీపై నమ్మకం ఎక్కడో కోల్పోతున్నారని తెలుస్తుంది.

తాజాగా ఈయన ప్రసంగం చూస్తే జగన్ లో వచ్చే ఎన్నికలలో తన పార్టీ గెలుపు కష్టంగా మారిందన్న ఆలోచనలు కూడా జగన్ కి వచ్చాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సంక్షేమ పథకాల పేరిట పెద్ద ఎత్తున బహిరంగ సభలను ఏర్పాటు చేసి ఈయన ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పొత్తుకు సిద్ధమే అంటూ ప్రకటించడంతో జగన్ లో కూడా ఎక్కడో వణుకు మొదలైందని తెలుస్తుంది.

 

కావలిలో చుక్కుల భూమలు సమస్యలకు పరిష్కారం అంటూ సభ పెట్టారు. అసలు విషయం కన్నా.. ఆయన మొత్తం రాజకీయంపై తనకు ఉన్న ఫ్రస్టేషన్ మొత్తం బయటపెట్టారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పొత్తుకు సిద్ధమయ్యారనే విషయం గురించి మాట్లాడుతూ…చంద్రబాబు నాయుడు గెలిస్తే ప్రజల సంక్షేమం నీరుగారి పోతుందని తెలిపారు,ఆయన గెలిస్తే మీకు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు రావని ప్రజలను బ్లాక్ మెయిల్ చేశారు.

 

ఇలా ఈ ప్రసంగంలో తరచూ చంద్రబాబునాయుడు గెలిస్తే అనే పదం వాడడంతో జగన్ కి సైతం క్రమక్రమంగా పార్టీపై నమ్మకాలు కోల్పోతున్నాయని పలువురు వైసీపీ నేతలు కూడా భావిస్తున్నారు. అయితే గతంలో 175 స్థానాలలోను వైసీపీ జెండా ఎగురుతుందని చెప్పినటువంటి ఈయన ఇప్పుడు ఆ నమ్మకం కోల్పోయారని తెలుస్తుంది.మీ బిడ్డ మీకు మంచి చేశారని అనిపిస్తేనే ఓట్లు వేయండి అని చెప్పిన జగన్ మీ బిడ్డకు మీరే సైనికులుగా అండగా నిలబడాలని చివరికి ఓట్ల కోసం ప్రజలను ప్రాధేయ పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -