CM Jagan: స్వామీజీతో సీఎం జగన్ బిగ్ గ్యాప్ వెనుక అసలు కథ ఇదేనా?

CM Jagan: విశాఖలో ఉన్న శ్రీ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామీకి ప్రభుత్వ పెద్దలకు మధ్య దూరం ఏర్పడిందని తెలుస్తుంది. ఒకానొక సమయంలో స్వరూపానంద స్వామి వారి ఆశీస్సుల కోసం వైసిపి నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చేవారు ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి రెండుసార్లు స్వామివారిని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఇలా వైసిపి నాయకులకు స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు ఉన్నాయని అందరూ భావించేవారు. అయితే గత కొద్ది రోజులుగా వైసిపి పెద్దలకు స్వామివారికి మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో విజయవాడలో జరిగిన మహా చండీయాగం సహిత రాజశ్యామల యాగానికి స్వామిని చాలా వరకూ దూరం పెట్టారని అంటున్నారు. ఆరు రోజుల పాటు ఈ యాగంలో కేవలం చివరి రోజున మాత్రమేస్వామివారు హాజరయ్యారు.

 

అదేవిధంగా సింహాచలంలో జరిగిన చందనోత్సవం కూడా ఆలయంలో ఏర్పాటు పట్ల స్వరూపానందేంద్ర స్వామీ ప్రభుత్వం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం మనకు తెలిసిందే. ఏడాది మొదట్లో శ్రీ శారదా పీఠంలో జరిగిన వార్షిక యాగానికి జగన్ హాజరు కాలేదు. అయితే గతంలో స్వామివారు మాట్లాడుతూ గత ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి తానే కారణం అంటూ ప్రచారం చేసుకున్నారు.

 

గత ఎన్నికలలో జగన్ గెలవడానికి తాను రాజ్యశ్యామల యాగం చేసానని ఈ యాగం వల్ల జగన్ గెలిచి ముఖ్యమంత్రి అయ్యారని తానే వైసీపీ ప్రభుత్వానికి ఆధ్యాత్మిక గురువుని అని ప్రచారం చేసుకోవడం వంటి అతి విషయాలే ఈ బిగ్ గ్యాప్ కి కారణం భావిస్తున్నారు. ఇది గమనించిన కొందరు ప్రభుత్వ నేతలకు స్వామివారికి ఎక్కడో చెడింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -