MLC: జగన్ పార్టీ ఘోర పరాజయం వెనుక అసలు కథ ఇదేనా?

MLC: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇవి చాలా సీరియస్ ఎన్నికలని వైసీపీ అన్నది. ఈ క్రమంలోనే వీటిని సీరియస్ గా తీసుకున్నారు పట్టభద్రులు. ఇక వైసీపీ అధినేత జగన్ పాలనకు రెఫరెండమ్ తీర్పు ఇవ్వాలని భావించారు. ఇక మూడు పట్టభద్రుల స్థానాలను టీడీపీకి కట్టబెట్టారు. ఈ దెబ్బకు జగన్ అండ్ కో అబ్బా అంటున్నారు.

గత ఎన్నికల్లో 151 సీట్లతో 50 శాతం ఓట్లతో గెలిచిన పార్టీకి రివర్స్‌లో అంత కంటే దారుణమైన పరాభవం ఎదురవబోతోందన్న సంకేతాలు ఈ ఎన్నిక ఇచ్చింది. గత ఎన్నికలకు ముందు విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించేవారు. అటు తెలంగాణ ప్రభుత్వాన్ని తమ ప్రభుత్వంగా మార్చుకుని పోలీసుల్ని వాడేసుకుంటూ, డేటా చోరీ అని ఇంకా ఏవేవో అని కేసులు పెట్టించి టీడీపీని ఇబ్బంది పెట్టారు.

 

ఐ ప్యాక్ తో సమన్వయం చేసుకున్నారు. అభ్యర్థుల ఆర్తిక అవసరాలు అన్నీ ఆయన చేతుల మీదుగానే సాగాయి. అందుకే ఫలితాలు వచ్చిన తర్వాత మొదట జగన్ కౌగలించుకుంది విజయసాయిరెడ్డినే. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నారో ఆ పార్టీలో ఎవరికీ తెలియదు. ఢిల్లీలో ప్రధాని, హోంమంత్రులతో భేటీ కావాలని జగన్ అనుకుంటే అప్పుడే ఆయన గుర్తొచ్చారు. ఇప్పుడు పార్టీ అంతా సజ్జల చేతుల్లోకి వెళ్లిపోయింది.మొత్తం ఆయనే చేస్తున్నారు.సోషల్ మీడియాను ఆయన కుమారుడికి ఇచ్చారు. ఆయన పార్టీకి జగన్ కు కాకుండా తనకు, తన తండ్రికి ఇమేజ్ బిల్డింగ్ చేసుకుంటున్నారు. సజ్జల పెట్టిన నేతలంతా చివరికి వైసీపీ పని అయిపోయిందనేలా చేశారు. కుటుంబం కూడా దూరం అయింది. ఒక్క సజ్జల మాత్రమే మిగిలారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -