Vivekananda: వివేకా హత్యపై విజయమ్మ, షర్మిల మౌనానికి కారణమిదేనా?

Vivekananda: ఏపీ రాష్ట్ర రాజకీయాలలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలనం రేపుతుంది.ఈయన మరణించి దాదాపు నాలుగు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇంకా దోషులు ఎవరు అనే విషయం ఓ కొలికి రాలేకపోవడంతో ఈ విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.ఇక ఈ కేసులో సిబిఐ విచారణ కూడా వేగవంతం చేసింది. అలాగే వైయస్ భాస్కర్ రెడ్డిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసులో రోజుకో విషయాలు వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవల్ గా మారిన దస్తగిరి, వివేకానంద రెడ్డి సునీల్ యాదవ్తల్లిని లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేశారు. అలాగే మూడోసారి సిబిఐ విచారణకు వెళ్లి బయటకు వచ్చిన తర్వాత వైయస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమా శంకర్ రెడ్డి వారితో వివేకానంద రెడ్డి లైంగిక సంబంధం పెట్టుకోవడం వల్లే సునీల్ యాదవ్ ఉమా శంకర్ రెడ్డి వివేకాను హత్య చేశారని చెప్పుకొచ్చారు.

 

ఇలా వీరిద్దరితో మాత్రమే కాకుండా ఈయన పెళ్లయిన తర్వాత ముస్లిం అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకొని ఒక కుమారుడికి జన్మ కూడా ఇచ్చారు. అలాగే వివేకానంద రెడ్డి తన పేరును షేక్ అక్బర్ రెడ్డిగా కూడా మార్చుకున్నారు. ఇక ఈ విషయాన్ని వివేకానంద రెడ్డి కూడా స్వయంగా ఒప్పుకున్నారు.ఇక వివేకానంద రెడ్డి ఆస్తి మొత్తం ముస్లిం మహిళకు జన్మించిన కొడుకు పోతుందన్న ఉద్దేశంతోనే వైయస్ సునీత తన భర్తతో కలిసి తన తండ్రిని హత్య చేయించిందని వాదన కూడా తెరపైకి వచ్చింది.

 

ఇలా వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గల కారణం ఆయన ఇతర మహిళలతో పెట్టుకున్న అక్రమ సంబంధాలే కారణమని వాదన తెలుస్తోంది. అయితే ఇలా వైయస్ వివేకానంద రెడ్డి గురించి ఈ విధమైనటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై వైయస్ విజయమ్మ షర్మిల మౌనం వహిస్తూ ఉన్నారు. ఎంపీ సీటు విషయంలో గొడవ కనక వచ్చి ఉంటే ఇప్పుడు వారెందుకు మౌనంగా ఉన్నారు.లేకపోతే వీరిద్దరు కూడా వైయస్ అవినాష్ రెడ్డికి మద్దతుగా నిలిచార అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -