NTR: ఆ ఈవెంట్ కు తారక్ దూరం కావడానికి రీజన్ ఇదేనా?

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు ఇప్పటికీ పూర్తి కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల చాలా ఆలస్యంగా షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. అందుకే ఏమాత్రం విరామం లేకుండా ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.

ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోయే సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీ కానున్నారు.ఇక ఈ రెండు సినిమాలు విడుదల అయ్యే సమయానికి బాలీవుడ్ చిత్రం వార్ 2 కూడా విడుదల కాబోతుంది. దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ మరో రెండు సంవత్సరాల పాటు సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారని తెలుస్తుంది. ఇలా వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ కి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో పాల్గొనాలని ఇప్పటివరకు ఇన్విటేషన్ అందలేదని తెలుస్తుంది.

 

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది సెలబ్రిటీలు అభిమానులు హాజరుకానున్నారు. అయితే బాలకృష్ణ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కి ఇన్విటేషన్ పంపించలేదని తెలుస్తోంది.మొదటినుంచి ఎన్టీఆర్ బాలకృష్ణకు మధ్య మనస్పర్ధలు ఉన్నాయని వార్తలు రావడం మనం చూస్తున్నాము. అలాగే ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ బాలకృష్ణ ఒకే చోట కనిపించిన బాలయ్య మాత్రం ఎన్టీఆర్ ను దూరం పెడుతూ వస్తున్నారు.

 

గత కొద్ది రోజుల క్రితం తారకరత్న పెద్దకర్మ రోజు కూడా బాలయ్య తారక్ ఇద్దరు ఎదురుపడిన బాలయ్య మాత్రం ఎన్టీఆర్ ను చూసి చూడనట్టు వెళ్లిపోవడంతో అభిమానులు ఈ విషయంపై ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే బాలకృష్ణ ఎన్టీఆర్ ను కించపరుస్తున్నారని భావించారు. అయితే తాజాగా తన తాతయ్య శత జయంతి వేడుకలకు ఇన్విటేషన్ పంపించకపోవడంతోనే ఈ వేడుకకు తారక్ దూరం కానున్నారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -