Coconut: దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే దాని అర్థం ఇదే?

Coconut: భారత దేశంలో హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన అందులో కొబ్బరికాయకు మొదటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కొబ్బరికాయను మొదలుపెట్టిన తర్వాతే ఆ శుభకార్యాన్ని మొదలు పెడుతూ ఉంటారు. గృహప్రవేశం, పెళ్లి, పూజా కార్యక్రమాలు ఇలా ఏ కార్యక్రమం అయినా సరే మొదట ఎవ్వరికాయను కొట్టి ఆ తర్వాత ఆ పనులు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ఇలా దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కొన్నిసార్లు బాగా పగిలితే మరికొన్నిసార్లు నిలువుగా పగులుతూ ఉంటుంది.

ఇంకొన్నిసార్లు కొబ్బరికాయ కుళ్ళిపోతుంటుంది. అలాగే కొబ్బరికాయ లోపల కొబ్బరి పువ్వు కూడా వస్తూ ఉంటుంది. కొంతమంది కొబ్బరికాయ బాగా పగిలినప్పుడు సంతోషపడడం కుళ్లిపోయినప్పుడు బాధపడడం లాంటివి చేస్తుంటారు. అయితే నిజంగా కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏం జరుగుతుంది. ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలా మంది కొబ్బరికాయ పుట్టినప్పుడు అది కుళ్లిపోయిందని బాధపడుతుంటారు. అలా కుళ్ళిపోవడం వల్ల వారికి కీడు జరుగుతుందని భయపడుతూ ఉంటారు. దాన్ని అశుభంగా కూడా పరిగణిస్తూ ఉంటారు.

 

అయితే కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆశుభం అన్నది కేవలం మనుషులం సృష్టించుకున్నది మాత్రమే. సాధారణంగా కొన్ని కొబ్బరి కాయలు కుళ్లిపోయి ఉంటాయి. ఆ విషయం మనకు తెలియదు కాబట్టి దేవుడి దగ్గర కొడతాము. వాస్తవానికి దేవుడికి కొబ్బరి కాయ, పుష్పం, ఫలం వీటిలో ఏదో ఒకటి సమర్పిస్తే స్వీకరిస్తానని భగవంతుడు చెప్పాడు. అది ఎలా ఉన్నా పర్వాలేదు. భక్తితో సమర్పించడమే ముఖ్యం అని శ్రీ కృష్ణడు భవద్గీగతలో చెప్పాడు. కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు.

కొబ్బరి కాయలో పువ్వు వస్తే అదృష్టం అని కొబ్బరికాయ కుళ్ళితే దురదృష్టమన్నది కేవలం మనుషులు సృస్టించుకున్న అపోహలు మాత్రమే. ఇలాంటివి ఏమీ మనసులో పెట్టుకోకుండా భక్తి శ్రద్ధలతో భగవంతుడిని కొలిస్తే ఎలాంటి చింతలు దరిచేరకుండా అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉంటారు. ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోయినప్పటికీ అంతా దేవుడి మీద భారం వేసి భక్తితో దేవుడిని నమస్కరిస్తే చాలు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -