T20: టీ20లకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడా?

T20: ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. ఫైనల్ చేరకుండా వెనక్కి రావడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. దీంతో జట్టులోని సీనియర్ ఆటగాళ్లను తొలగించాలంటూ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజం కూడా ఈ అంశాన్ని ప్రస్తావించాడు. జట్టులో ఆరుగురు సీనియర్లను వెంటనే తొలగించి వచ్చే టీ20 ప్రపంచకప్ నాటికి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని కోరాడు.

మాజీల డిమాండ్ నేపథ్యంలో జట్టులో సీనియర్ ఆటగాళ్లు రోహిత్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, అశ్విన్, దినేష్ కార్తీక్, షమీ కెరీర్ డైలామాలో పడింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ప్రపంచకప్ నాటికి రోహిత్ వయసు 37 అవుతుందని.. అందుకే అతడు పొట్టి క్రికెట్ నుంచి తప్పుకోవాలని సూచించాడు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం మరో ప్రపంచకప్ ఆడాలని ఆకాంక్షించాడు.

టీమిండియాలో ఫిట్‌గా ఉండే ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు అని.. అతడి వయసు 34 ఏళ్లు ఉన్నా ఫిట్‌నెస్ సమస్య కాదని పనేసర్ అభిప్రాయపడ్డాడు. దీంతో కోహ్లీ వచ్చే టీ20 ప్రపంచకప్ కూడా ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నాడు. అయితే అతడి ఫామ్ ప్రకారమే జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంటుందని తెలిపాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే దినేష్ కార్తీక్, అశ్విన్ అయితే మరో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడే అవకాశమే లేదన్నాడు.

రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌పై ద్రవిడ్ ఏమన్నాడంటే..?

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యం చెందడంతో సీనియర్ ఆటగాళ్లు రోహిత్, విరాట్, అశ్విన్ లాంటి ఆటగాళ్ల భవిష్యత్ ఏంటని ఇటీవల మీడియా సమావేశంలో కోచ్ ద్రవిడ్‌ను జర్నలిస్టులు ప్రశ్నించారు. దీంతో రోహిత్, కోహ్లీ జట్టు కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని.. ఇలాంటి సమయంలో రిటైర్మెంట్ గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నాడు. అటు బీసీసీఐ కూడా తాము ఏ ఆటగాడిని కూడా రిటైర్ అవ్వాలని అడిగే ప్రసక్తే లేదని.. అయితే వచ్చే ప్రపంచకప్‌లో యువకులకే పెద్ద పీట వేస్తామని తెలియజేసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -