Balineni Srinivasa Reddy: బాలినేని బ్లాక్ మెయిల్ విషయంలో వైసీపీ అలా చేయబోతుందా?

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు, ఒంగోలు, తిరుపతి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ గా తన బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే.

సీఎం వైఎస్ జగన్ కి సమీప బంధువైన బాలినేనికి మొదటి నుంచి తగినంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు జగన్. సీఎం వైఎస్ జగన్ తొలికేబినెట్లో మంత్రిగా పనిచేసిన బాలినేనికి తర్వాత ఉద్వాసన పలికారు పార్టీ నాయకులు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉన్న బాలినేని ఉన్నట్లుండి తన పదవికి రాజీనామా చేసి వైయస్సార్ నాయకులకి షాక్ ఇచ్చారు.

 

ఇటీవల కాలంలో ఆయనకి వైసీపీలో ప్రాధాన్యం తగ్గటం లేదు ప్రోటోకాల్ కూడా లభించడం లేదు. అదే జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్ తో ఆధిపత్య పోరు కొనసాగుతుంది బాలినేనికి. అలాంటి ఆదిమూలపు సురేష్ ని మంత్రిగా కొనసాగించడంపై బాలినేని తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం.

 

అయితే ఈయన అలకని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని, పార్టీ అవసరం ఆయనకు ఉంది కానీ ఆయన అవసరం పార్టీకి లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వైసిపి నాయకులు.ఆయనని బ్రతిమాలి మళ్లీ పార్టీలోకి తెచ్చుకునే ఉద్దేశం లేనట్లుగా ప్రవర్తిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో మొదటి నుంచి వైఎస్ఆర్సిపి బలహీన పడటానికి బాలినేని ప్రవర్తన కారణం అని ఆ పార్టీ ముఖ్య నాయకులు గమనిస్తూ వస్తున్నారు.

 

గతంలో నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు బాలినేని తన వంతు ప్రయత్నం చేశారని ఇప్పటికే అతని మీద గుర్రుగా ఉన్నారు పార్టీ పెద్దలు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో కోఆర్డినేటర్ పదవికి న్యాయం చేయలేనని తన నియోజకవర్గంలో తిరగాల్సిన అవసరం ఉందని బయటికి చెబుతున్న బాలినేని నిజానికి వైసీపీ మీద కోపంతోనే ఇదంతా చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులకి సమాచారం ఉంది. అందుకే ఆయన బ్లాక్ మెయిల్ ని పెద్దగా ఎవరూ స్పందించడం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -