NTR Fans: బాలయ్య సినిమాలపై పగ తీర్చుకుంటామన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఏమైందంటే?

NTR Fans: నందమూరి హీరోస్ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ఇద్దరు హీరోలకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. ఇద్దరు నందమూరి హీరోలే అయినప్పటికీ ఇద్దరి హీరోల మధ్య మాత్రం గ్యాప్ వచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ వల్ల కామన్ ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సఖ్యత లేకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ రెండుగా చీలిపోతున్నారు. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఇకమీదట బాలయ్య సినిమాలను చూడము అని తెగేసి చెబుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు.

మరొకవైపు బాలయ్య అభిమానులు కూడా ఇదేవిధంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరి హీరోల మధ్య ఉన్న గ్యాప్ గురించి అనేక రకాల వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా ఇటీవల మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అని తెలిసి కూడా ఆరోజే హైదరాబాద్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఆ వేడుకలకు రాలేనని తారక్ ముందే చెప్పినా బాలయ్య అభిమానులు కావాలని ఎన్టీఆర్ టార్గెట్ గా ట్రోల్స్ చేయడం జరిగింది. టీడీపీ ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ను కించపరిచేలా పోస్ట్ లు పెడుతున్నారని అనవసర వివాదాల్లోకి తారక్ ను లాగుతున్నారని తారక్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

 

ఎన్టీఆర్ అంటే తమకు అభిమానం అని ఆయన జోలికి వస్తే బాలయ్య అయిన ఎవరైనా తమకు ఈక్వల్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తానికి బాలయ్య బాబు ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఈ వార్ ఆగాలి అంటే బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఒకే వేదికపై కనిపిస్తే ఈ పరిస్థితి మారే ఛాన్స్ ఉంది. మరి ఈ వార్తలపై ఎన్టీఆర్ బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -