Jagan-Roja: కలపాల్సింది చేతుల్ని కాదు జగన్ మనసుల్ని.. చేతులు దులుపుకుంటే ఎలా అంటూ?

Jagan-Roja: వచ్చే ఎన్నికలలో మంత్రి రోజాకి తెలుగుదేశం నుంచి కాదు సొంత పార్టీలోనే ఆమెని ఓడించాలని చూస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే గత కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మాజీ మున్సిపల్ చైర్మన్ దంపతులకు నగరిలో ఆధిపత్య పోరు నడుస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రోజాకి వ్యతిరేకంగా వారు పనిచేశారని, అప్పటినుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గతంలో కేజీ అనుచరులు అనేక సందర్భాల్లో రోజాను అడ్డుకున్నారు.

ఆవర్గ పోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సీఎం జగన్ నగరి పర్యటన కూడా ఈ వర్గపోరుని రూపుమాపలేకపోయింది. సీఎం జగన్ నగర పర్యటన వైసీపీలోని వర్గ పోరుని రూపుమాపలేకపోయింది. నగరిలో విద్యా దీవెన బటన్ నొక్కి కార్యక్రమం పూర్తయ్యాక జగన్ స్థానిక డిగ్రీ కళాశాల వద్ద సుమారు 45 నిమిషాల పాటు జిల్లా నాయకులతో మాట్లాడారు. రోజాకు నగరిలో వ్యతిరేకంగా ఉన్న కేజే కుమార్, శాంతి దంపతులతో ప్రత్యేకంగా మాట్లాడారు.

 

అందరూ కలిసి పని చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. వేదిక పక్కన శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న జగన్ ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతితో మాట్లాడి కలిసి పని చేయండి అన్నట్లుగా మంత్రి రోజా వైపు చూపించారు. అయితే వారిద్దరూ మొఖాలు కూడా చూసుకోలేదు. సీఎం స్వయంగా వారి చేతులు పట్టుకుని కలిపే ప్రయత్నం చేశారు. శాంతి తన చేతిని ముందుకు చాచేందుకు ఇష్టపడలేదు రోజా కూడా అనాసక్తంగా ఉండిపోయారు.

 

జగన్ గట్టిగా లాగి ఇద్దరు చేతుల్ని బలవంతంగా కలిపారు. అయితే రెప్పపాటు కాలంలోనే ఇద్దరు తమ చేతుల్ని వెనక్కి లాగేసుకున్నారు. నియోజకవర్గంలో రోజా వ్యతిరేక వర్గం ఎంత గట్టిగా ఉందో ఈ సంఘటన ద్వారా మనకి తెలుస్తుంది. ఒకవైపు రోజాకు ఏమాత్రం సంబంధం లేకుండా ఆమె నియోజకవర్గంలోని నాయకులకు ఎడాపెడా పదవులు కట్టబెట్టారు. అలాంటప్పుడు రోజాని వారు ఎందుకు ఖాతరు చేస్తారని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇలాంటి సమయంలో కలపవలసింది చేతుల్ని కాదు మనసులని అంటూ ప్రతిపక్షాలు వారు సీఎంని ఎండగడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -