Jagan-Balayya: బాలయ్యపై అభిమానం చాటుకున్న జగన్.. ఏం చేశారంటే?

Jagan-Balayya: రాజకీయ వైరం వేరు.. వ్యక్తుల మధ్య ధ్వేషాలు వేరు.. రాజకీయంగా ఎన్ని విమర్శలు.. ప్రతివిమర్శలు చేసుకున్నా.. వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు మనం చూస్తూనే ఉంటాం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌.. టీడీపీ నేత, నటుడు నందమూరి బాలకృష్ణ మధ్యలో సరిగ్గా ఇదే జరిగింది. ఇందుకు పద్మాలయ స్టూడియో వేదిక అయ్యింది.

సూపర్‌స్టార్‌ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన పార్థీవ దేహాన్ని అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోకి తీసుకువచ్చారు. అక్కడే హీరో మహేశ్‌ బాబు, అతని కుటుంబ సభ్యులు అంతా ఉన్నారు. కృష్ణకు నివాళి అర్పించేందుకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం పద్మాలయ స్టూడియోకు చేరుకున్నారు. ముందుగా కృష్ణ పార్థివ దేహానికి పుష్పగుచ్చం ఉంచి, ఆయన చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడే ఉన్నకృష్ణ కుమారుడు మహేశ్‌ బాబును, కుటుంబ సభ్యులను సీఎం జగన్‌ పరామర్శించారు. మహేశ్‌ బాబును ఆలింగనం చేసుకుని ఓదార్చారు.

– మహేశ్‌ బాబు వద్దే బాలయ్య.. 

అప్పటికే మహేశ్‌ బాబును పరామర్శించేందుకు నందమూరి బాలకృష్ణ తన ఫ్యామిలీతో పద్మాలయ స్టూడియోకు వచ్చారు. కృష్ణ భౌతిక కాయానికి నివాలి అర్పించిన అనంతరం మహేశ్‌ బాబు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాసేపటికి సీఎం జగన్‌ రావడం.. మహేశ్‌ బాబును పలకరించడం.. అక్కడే బాలయ్య కనిపించడంతో జగన్‌ ఏమాత్రం ఆలోచించకుండా బాలయ్యను పలకరించారు.

పద్మాలయ స్టూడియో వేదికగా రాజకీయ ప్రత్యర్థి అయిన బాలయ్యను సీఎం జగన్‌ పలకరించడం అక్కడ హాట్‌ టాపిక్‌ అయ్యింది. అక్కడే ఉన్న కృష్ణ కూతుర్లు, కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని జగన్‌ పలకరించారు. కృష్ణ కడసారి చూపు కోసం ఆయన అభిమానులు పోటెత్తారు. ఏపీ మంత్రి రోజా, తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌, రఘురామ కృష్ణ రాజు, జయప్రద, త్రివిక్రమ్, మెహెర్ రమేష్ ఇంకా పలువురు ప్రముఖులు రాగా.. అక్కడ అభిమానుల మధ్య తోపులాట జరిగింది.

Related Articles

ట్రేండింగ్

Raghu Rama Krishnam Raju: ఉండిపై ఉడుం పట్టు పట్టిన రఘురామ కృష్ణంరాజు.. అసెంబ్లీలో జగన్ కు వణుకేనా?

Raghu Rama Krishnam Raju: రఘురాం కృష్ణంరాజు కి కూటమి తరపున టికెట్ రాదు అనే భావించిన వైసీపీ వర్గం వారు సంబరాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అనూహ్యంగా తెదేపా...
- Advertisement -
- Advertisement -