Jagan: నమ్ముకున్న వాళ్లకు జగన్ అన్యాయం చెయ్యడు.. ఇదే సాక్ష్యమంటూ?

Jagan: చాలామంది వైసీపీ నేతలు వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని కోరుకోవడంతో పాటు కొంతమంది వైసీపీ ఈ రాజకీయ నాయకులు వైసిపి కోసం సొంత డబ్బును కూడా ఖర్చు పెట్టారు.. అటువంటి వారికి తీవ్ర నిరాశ ఎదురయ్యింది. అంతేకాకుండా చాలామందికి బిల్లులు పడకపోవడంతో లాభం సంగతి పక్కన పెడితే అప్పుల పాలు అయిన వారు చాలామంది ఉన్నారు.
దాంతో వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చినా, త‌మ‌కు న్యాయం జ‌ర‌గలేద‌ని చాలా మంది నాయ‌కులు, కేడ‌ర్‌లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కానీ వైసీపీని న‌మ్ముకున్న వారంద‌రికీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ న్యాయం చేశార‌ని ఆయ‌న చిన్నాన్న‌, ఉత్త‌రాంధ్ర వైసీపీ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కాగా తాజాగా వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్ వైసీపీలో చ‌ర్చ‌నీయాంశ‌ం అయ్యాయి. ఇవాళ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. పొత్తుల‌పై వైవీ సుబ్బారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌రే వ‌చ్చినా, ఇద్ద‌రొచ్చినా, ముగ్గురొచ్చినా, న‌లుగురొచ్చినా తాము మాత్రం ఒంట‌రిగానే ఎదుర్కొంటామ‌ని అన్నారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ పొత్తుల కోసం వెంప‌ర్లాడుతున్నార‌ని అన్నారు.

 

ఎన్నిక‌లు ఎప్పుడు వచ్చినా, ప్ర‌తిప‌క్షాలు ఎలా వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామ‌ని అన్నారు. అదేవిధంగా జనసేన అధినేత ప‌వ‌న్ ప‌బ్లిసిటీ కోసమే వలంటీర్ల‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. స్క్రిప్ట్ ఎవ‌రో రాసిస్తే ప‌వ‌న్ చ‌దువుతున్నారంటూ పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తున్న వాలంటీర్ల‌పై పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేద‌ని ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. వైసీపీని న‌మ్ముకున్న అంద‌రికీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ న్యాయం చేశార‌ని ఆయ‌న చెప్ప‌డం విశేషం. క్షేత్ర‌స్థాయిలో త‌మ పార్టీ బ‌లంగా వుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -