Jagan: పులివెందుల బాధ్యతలను అతనికి అప్పగించిన జగన్.. ఏం జరిగిందంటే?

Jagan: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వ్యూహాలు రచిస్తూ.. ఎత్తుకు పోయి ఎత్తులు వేస్తూ ఏ పార్టీకి ఆ పార్టీ గెలవాలని తెగ ఆరాట పడుతున్నారు రాజకీయ నాయకులు. ఈ ఐదు సంవత్సరాలు మర్చిపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకొని మరి ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగానే మన ముఖ్యమంత్రి జగన్ పులివెందులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

పులివెందులలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. అలాగే ఈటీవీలో పులివెందులలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభంలో కూడా చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తీర్పు ఏ విధంగా వచ్చినప్పటికీ సందిగ్ధంలో పడిపోకుండా మరొక అభ్యర్థిని రంగంలోకి దింపటానికి తగిన ప్రణాళికలు రచించే ఉంచుకున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి తాజా పరిణామాలపై జగన్కి వివరించినట్లు తెలుస్తోంది.

 

అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించిన తుది చార్జిషీట్ ని కూడా సిబిఐ కోర్టుకి సమర్పించిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో కేసుకి సంబంధించి అవినాష్ కి ప్రతికూలంగా తీర్పు వస్తే అప్పుడు పులివెందులలో రాజకీయ బాధ్యతలను చూసుకోవటానికి ఒక నమ్మకమైన వ్యక్తిని సిద్ధం చేసుకున్నారంట సీఎం జగన్. ప్రస్తుతం పులివెందుల వైసీపీ బాధ్యతలని అవినాష్ రెడ్డి చూస్తున్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ని అవినాష్ రెడ్డి కలుసుకొని ఇదే విషయం గా సుదీర్ఘంగా చర్చించుకున్నట్లు రాజకీయ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు.

 

ఒకవేళ తీర్పు అవినాష్ రెడ్డికి ప్రతికూలంగా వస్తే పక్క జిల్లాకు చెందిన నాయకుడిని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారు జగన్. ఆ నాయకుడికి బాధ్యతల అప్పగింతలపై ఇప్పటికే దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. అలాగే తన కుటుంబానికి చెందిన వైఎస్ అభిషేక్ రెడ్డిని నియోజకవర్గ వ్యాప్తంగా తిరగాలని జగన్ సూచించినట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -