Jagan Govt: జగన్ పాలనలో ఆరుసార్లు విద్యుత్ ఛార్జీల పెంపు.. ఇంత ఘోరాలు ఎప్పుడూ చూడలేదంటూ?

Jagan Govt: బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. కానీ… బాబు వచ్చాడు.. బాదుడు కార్యక్రమం వచ్చింది గత ఎన్నికల ముందు జగన్ ఊరూరా ప్రచారం చేశారు. బాబొచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచారని గొంతు చించుకొని అరిచారు. దేవుని దయతో.. ప్రజల చల్లని దీవెనలతో మన ప్రభుత్వం వస్తే.. బాబు పెంచిన విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తానని జగన్ మాటిచ్చారు. అంతే.. జగన్ హామీలకు ఫ్లాట్ అయిన జగన్ ఓటేశారు. ఆ తర్వాత బాదుడే బాదుడు ఎలా ఉంటుందో చూపించారు. జగన్ బాదుడు కార్యక్రమం గురించి చెబితే.. అంత త్వరగా తేలే వ్యవహారం కాదుకానీ.. విద్యుత్ ఛార్జీల గురించి ఓసారి పరిశీలిస్తే.. ఈ ఐదేళ్లలో ఏకంగా జనంపై అధనంగా రూ. 18,817 కోట్ల రూపాయల భారం వేశారు. జగన్ ప్రభుత్వం అంచనాల బట్టి మరో రూ.12,491 కోట్లు భారం ప్రజలపై పడాల్సి ఉంది. కానీ, ఎన్నికలు ఉన్నాయి కనుక చిన్న గ్యాప్ తీసుకున్నారు. ఒకవేళ మరోసారి అధికారంలోకి వస్తే.. జగన్ స్టైల్ ఆఫ్ సంక్షేమంలో భాగంగా రూ.12,491 కోట్లు భారం వేయనున్నారు.

విద్యుత్ ఛార్జీల భారాన్ని ఏకంగా ప్రజలపై 6 రకాలుగా పెంచారు. జగన్ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే.. విద్యుత్ ఛార్జీలపై మోత మోగింది. నెలకు 500 యూనిట్లకు మించి వినియోగిస్తే ఛార్జీల భారాన్ని మోపింది. యూనిట్‌కి 90 పైసలు పెంచి ఏటా రూ. 1,300 కోట్ల అదనపు భారం వేశారు. మొత్తం నాలుగేళ్లలో రూ. 5,200 కోట్లు వసూలు చేసింది.

ప్రజలపై భారాన్ని ఎలా పెంచాలో.. ప్రభుత్వానికి ఆదాయాన్ని ఎలా రాబట్టాలో జగన్ సర్కార్ ను చూసి నేర్చుకోవచ్చు. కంటికి కనిపించకుండా.. ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వానికి ఆదాయం రాబట్టారు. గృహ, ఎల్‌టీ వాణిజ్య విద్యుత్‌ వినియోగదారులపై స్థిర ఛార్జీల భారాన్ని వేసింది. కనీస వినియోగ ఛార్జీలకు బదులు.. కాంట్రాక్ట్‌ లోడ్‌పై స్థిర ఛార్జీల కింద కిలోవాట్‌కు 10 రూపాయలు.. వసూలు చేసే విధానాన్ని 2021 ఏప్రిల్‌ నుంచి అమలులోకి తీసుకొని వచ్చింది. మూడు కిలోవాట్ల కాంట్రాక్ట్‌ లోడ్‌ తీసుకున్న సింగిల్‌ ఫేజ్‌ కనెక్షన్‌ వినియోగదారుల నుంచి ప్రతినెలా 30 రూపాయలు, త్రీఫేజ్‌ కనెక్షన్‌ వినియోగదారుల నుంచి కనీస కాంట్రాక్ట్‌ లోడ్‌ అయిదు కిలోవాట్లపై 50 రూపాయలు వసూలు చేసింది. అంటే ప్రతీనెల కట్టే కరెంట్ బిల్లుకు ఇది అదనం. 2021 నుంచి ఇప్పటి వరకు ఏడాదికి 600 కోట్ల రూపాయల భారాన్ని మోపి, మూడేళ్లలో 1,800 కోట్లను వసూలు చేసింది. ఆ తర్వాత టీడీపీ హయాంలో అంటే 2014-19 మధ్య వినియోగించిన విద్యుత్ కు ట్రూఅప్ 2910.74 కోట్ల రూపాయలు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకుంది. అందులో ఇంత వరకూ 1,455.37 కోట్ల రూపాయలు వసూలు చేశారు.

2021-22 ఏడాదిలో వాడుకున్న విద్యుత్ ఇంధన సర్దుబాలు చార్జీల పేరుతో 3,082.99 కోట్లు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఆ ఛార్జీలు వసూలు చేసే బాధ్యత డిస్కంలకు ఇచ్చింది. ఇప్పటి వరకూ 2,569.16 కోట్ల రూపాలయలను డిస్కంలు వసూలు చేశాయి.శ్లాబ్‌ల్లో మార్పులు చేసి ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నించింది. అప్పట్లో సగటు విద్యుత్‌ వినియోగం రోజుకు 190 ఎంయూలుగా ఉంది. దాన్ని రోజుకు సగటున 200 ఎంయూలకు పెంచింది. అంటే.. ఈ లెక్కన ఏటా అదనంగా పెరిగిన 3,600 ఎంయూల వినియోగంపై ఛార్జీల భారం మోపింది. దీంతో..ప్రభుత్వ ఆదాయం రూ. 1,544 కోట్లకు చేరింది. గత రెండేళ్లలో రూ. 2,944 కోట్ల భారం వినియోగదారులపై పడింది. ఇక చివరిగా గతేడాది ఏప్రిల్ నుంచి విద్యుత్ కొనుగోలుకు అదనంగా చేసిన ఖర్చు కోసం ఇంధన సర్ధుబాటు చార్జీల పేరుతో యూనిట్‌కు 40 పైసల పెంచి.. దాన్ని వసూలు చేసే బాధ్యత డిస్కంలకు ఇచ్చింది. ఇలా నెలకు ప్రజలపై రూ.240 కోట్ల భారం పడుతుంది. ఏడాదికి రూ.2880 కోట్లు వసూలు చేస్తుంది.

ఇలా జగన్ ప్రభుత్వం ముందుగానే విద్యుత్ ఛార్జీల పేరుతో ఎంత వసూలు చేయాలో ఫిక్స్ చేసుకుంది. ఇప్పటి వరకూ రూ.18,817 కోట్ల రూపాయలు వసులు చేసింది. మరో రూ.12,491 కోట్ల వసూలు ప్రణాళికలు ఉన్నాయి. అయితే, ఎన్నికల నేపథ్యంలో ఆ ప్లాన్ కొంతకాలం పక్కన పెట్టింది. అధికారంలోకి వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -