Jagan: పది రోజుల పాటు అమ్మఒడి సంబరాలని చెబుతున్న జగన్.. కానీ?

Jagan: జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ నవర్నతాల పేరుతో పేద ప్రజలకు వివిధ రకాల పథకాలు అందిస్తోంది. అందులో విద్యార్థులకు ఇచ్చే అమ్మఒడి పథకం ప్రధానమైనది. ఈ పథకాన్ని ప్రభుత్వంలోకి జగన్ వచ్చినప్పటి నుంచి ఇస్తున్నారు. అయితే రాను రాను ఖజనా ఖాళీ అవటంతో జగన్ సర్కారుకు తిప్పలు తప్పటం లేదు. దీంతో పథకానికి కొన్ని కొర్రీలు పెట్టారు. ఇప్పుడు తాజా మరో బాంబ్ పేల్చటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు.

వైసీపీ సర్కారు ఏ పథకాన్ని ప్రజలకు అందించాలన్నా బటన్ నొక్కుడుతోనే చేస్తోంది. ఎందుకంటే పారదర్శకత అని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మరి లిక్కర్ వద్ద మాత్రం, పైసలు కక్కాల్సిందే. అక్కడ నో ఆన్లైన్ అని చెబుతోంది. ఈ విషయాన్ని పక్కకు పెడితే, ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లాలో జగన్న అమ్మఒడి పథకానికి CM జగన్ బటన్ నొక్కాడు.
కానీ డబ్బులు చాలా మందికి పడలేదని టాక్ వినిపిస్తోంది.

 

అమ్మఒడి డబ్బు ఎందుకు పడలేదని అడిగితే, పది రోజుల పాటు అమ్మఒడి సంబరాలు జరుగుతాయని అంటున్నారు. అంటే పది రోజుల్లో ఎప్పుడైనా పడొచ్చని చెబుతున్నారు. మరి ఈ మాత్రానికి ఎందుకు అన్ని ప్రకటనలు, ఇవాలే ఇచ్చే పరిస్థితి ఉన్నట్లు డబ్బా ఎందుకు కొట్టారని పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు.

 

మరోవైపు అమ్మఒడికి పదిహేను వేలిస్తున్నామని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఇచ్చేది పదమూడు వేలే. గతంలో ల్యాప్ ట్యాప్ ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వలేదు. ఇద్దరు పిల్లలకు ఇస్తామని చెప్పారు. అదీ లేదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి అమ్మఒడి ఇస్తామన్నారు. కానీ ఒక్కరికే సరిపెట్టారు. ఇవన్నీ చూస్తుంటే వచ్చే సారి ఈయన వస్తే అసలు ఈ పథకాన్ని పూర్తిగా ఉండవనే మాట వినిపిస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -