Jagan: రాజ్యసభ కోసం ఎస్సీల దిశగా జగన్ అడుగులు.. ఏం చేశారంటే?

Jagan: ఎన్నికలు దగ్గరపడే కొద్ది వైసీపీకి ఒక్కో వర్గం దూరం అవుతోంది. టికెట్ల కేటాయించిన తర్వాత ఎస్సీలు వైసీపీ నుంచి దూరం జరుగుతున్నారనే చర్చ జోరుగా జరుగుతుంది. ఇప్పటి వరకూ విడుదల చేసిన జాబితాల్లో ఎక్కువ మంది సిట్టింగ్ ఎస్సీ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. ఈ విషయాన్ని బాధితలు మీడియా ముందు చెబుతూ బోరున విలపిస్తున్నారు. ఒక్కో బాబిత విడుదల చేస్తున్న ప్రతీసారీ.. ఏదో ఒక ఎస్సీ ఎమ్మెల్యే అధిష్టానంపై అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. వైసీపీలో ఎస్సీలకు విలువ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే ఎమ్మెల్యేగా ఉన్నా.. పవర్స్ అన్నీ స్థానిక రెడ్డీ నాయకుల దగ్గరే ఉన్నాయని చెబుతున్నారు.

 

వరుసగా జరుగుతున్న ఘటనలతో వైసీపీకి ఎస్సీలు దూరం అవుతున్నారనే అభిప్రాయం బలపడింది. ఇదే అవకాశాన్ని టీడీపీ, కాంగ్రెస్ క్యాచ్ చేసుకునే పనిలో పడ్డాయి. సామాజిక న్యాయం జరిగేది బీజేపీతోనేనని చంద్రబాబు చెబుతున్నారు. అంతేకాదు.. వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని పెద్ద ఎత్తున ప్రచారాన్ని టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఈ విషయంలో కొంతమేర సక్సెస్ అయింది. గత రెండేళ్లుగా ఇదే పనిలో ఉంది టీడీపీ. ఇక షర్మిల విషయానికి వస్తే.. మొదటి నుంచి దళిత ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ తోనే ఉంటుంది. కానీ, రాష్ట్ర విభజన తర్వాత దళితులు వైసీపీ వైపు ర్యాలీ అయ్యారు. కానీ, ఇప్పుడు షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ దళితులపై నమ్మకం పెట్టుకుంది. దళితుల్లో ఎక్కువ మంది క్రస్టియన్స్ ఉంటారు కనుక అది కాంగ్రెస్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గ్రహించిన జగన్ అలర్ట్ అయ్యారు. తమతో నిత్యం ఉండే దళిత ఓట్ బ్యాంక్ ను కోల్పోతే రాజకీయంగా నష్టం తప్పదని భావించారు. దీంతో, ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యత్వం ద్వారా దళితులను దగ్గరకు చేర్చుకోవాలని చూస్తున్నారు. త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 3 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే.. నిన్నమొన్నటి వరకూ దళితులకు ఓ సీట్ కేటాయించాలని జగన్ ఆలోచన. కానీ, ప్రస్తుత పరిణమాల దృష్ట్యా రెండు స్థానాలు దళితులకు కేటాయించాలని మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు(ఎస్సీ) పేర్లు బలంగా వినిపించాయి. ఇద్దరు రెడ్లు, ఒక ఎస్సీ నేతను రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఒకరెడ్డిని వెనక్కి తగ్గించి ఆ స్థానంలో కూడా దళితులకే అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

 

ఎమ్మెల్యేల బలాబాలాలు బట్టి చూస్తే.. మూడుకు మూడు స్థానాలు వైసీపీ దక్కించుకోగలదు. కానీ, టీడీపీ కూడా ఓ అభ్యర్థిని నిలబెట్టి.. ఓ స్థానాన్ని దక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. అసంతృప్తితో ఉన్న దళిత ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుంటే.. ఓ రాజ్యసభ స్థానం తమ ఖాతాలో పడుతోందని చంద్రబాబు ఆలోచన. అందుకే జగన్ కూడా అలర్ట్ అయ్యారు. ఇద్దరు దళితులకు రాజ్యసభ స్థానాలు కేటాయిస్తే.. అలకబూనిన ఎస్సీ ఎమ్మెల్యేలు తమతోనే ఉంటారని భావిస్తున్నారు. మరి చూడాలి చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా? జగన్ పైచేయి సాధిస్తారో?

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -