Jagan: వివేకా హత్య కేసు అరెస్ట్ లతో జగన్ కు టెన్షన్.. ఏమైందంటే?

Jagan: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ కేసును వేగవంతం చేసి బాధితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైయస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అందరినీ ఒక్కసారిగా ఆందోళనకు గురిచేస్తుంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి కుటుంబానికి సంబంధం ఉందని సీబీఐ మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఇలా భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడంతో పులివెందులలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలో టెన్షన్ పడుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన తన ప్రోగ్రామ్స్ అన్నింటిని క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తుంది. సోమవారం అనంతపురంలో విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొనాల్సిన ముఖ్యమంత్రి ఉన్నఫలంగా తన పర్యటనను వాయిదా వేశారు. అందుకు గల కారణం కొన్ని అనివార్య కారణాలు అని చెబుతున్నారు.

 

సీఎం తన ప్రోగ్రామ్ రద్దు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అని ఆలోచనలో పడ్డారు.విద్య వసతి దీవెన బటన్ నొక్కాడానికి సరైన నిధులు లేకపోవడం ఒక కారణం అని చెబుతున్నప్పటికీ ఈయన భాస్కర్ రెడ్డి అరెస్ట్ విషయంలో ఢిల్లీ వెళ్తున్నారని సమాచారం. మొత్తానికి భాస్కర్ రెడ్డి అరెస్ట్ జగన్ లో ఎక్కడో తెలియని టెన్షన్ మొదలైందని పలువురు ఆరోపిస్తున్నారు.

 

ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళకుండా తన ప్రోగ్రామ్స్ అన్ని రద్దు చేసుకొని తాడేపల్లిలోని ఉంటారని తెలుస్తోంది.మరి ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ అవ్వడానికి సరైన కారణం తెలియకపోయినా ప్రస్తుతం ఈ విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇక మరి కొద్ది రోజులలో వారం పాటు జగన్మోహన్ రెడ్డి దంపతులు విదేశీ పర్యటనలకు వెళుతున్నట్లు సీఎంవో సమాచారం. లండన్ లో చదువుతున్న తన కూతురు వద్దకు వెళ్లి ఒక వారం రోజులపాటు విదేశాలలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వసతి దీవెన డబ్బులు ఎప్పుడు విద్యార్థుల ఖాతాలో జమ చేస్తారనేది తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -