Jagan: ఎవరు ఎవరికి ద్రోహం చేశారు జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానముందా?

Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మోసం చేశారా? లేక కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డికి ద్రోహం చేసిందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఈ వ్యవహారం గురించి ఇప్పుడు ఎందుకు చర్చించుకుంటున్నారు అన్న విషయం కు వస్తే.. ఈ ప్రశ్నలు తలెత్తడానికి ముఖ్య కారణం జగన్ అని చెప్పవచ్చు. ఇటీవలే వైఎస్ షర్మిల కాంగ్రెస్ లోకి చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఏపీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ తనకు ద్రోహం చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. తన చెల్లి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆమెను తనకు శత్రువును చేసిందని, తన చెల్లిని అడ్డం పెట్టుకొని తనను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోందని చెబుతున్నారు జగన్.

 

మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డికి ద్రోహం చేసిందా? అన్న ప్రశ్న ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. అలాగే జగనే కాంగ్రెస్ పార్టీని మోసం చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇంతకుముందు ఏపీలో వైయస్ అంటే కాంగ్రెస్ , కాంగ్రెస్ అంటే వైఎస్ అన్నట్టుగా పరిస్థితులు ఉండేవి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా చివరి శ్వాస వరకు ఆ పరిస్థితిలో అలాగే కొనసాగుతూ వచ్చాయి. కాంగ్రెస్ కూడా వైయస్ ఫ్యామిలీకి చాలానే చేసిందని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే వైఎస్ కుటుంబం రాజకీయంగా, ఆర్ధికంగా ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే అనడంలో సందేహానికి తావు లేదు. వైఎస్ తన విధేయతతోనే పార్టీ పెద్దలను అనుకూలంగా మార్చుకున్నారు.

ప్రతి పథకాన్నీ పార్టీ పెద్దల పేర్లతోనే రూపకల్పన చేసే వైఎస్.. ప్రతి పథకంలో తన మార్క్ ఉండేలా చూసుకునేవారు. అలా కాంగ్రెస్ నుండి వైఎస్ రాజకీయంగా ఎంతగా ఎదగాలో అంతకి చేరుకున్నారు. అలాగే కుటుంబాన్ని కూడా రాజకీయంగా, ఆర్ధికంగా పరిపుష్టిగా మార్చుకున్నారు. తమ్ముడిని మంత్రిగా, కుమారుడిని ఎంపీగా చేసుకున్నారు. కుమారుడు జగన్ ఆర్ధిక సామ్రాజ్యాన్ని బలంగా నిర్మించుకొనేందుకు తండి వైఎస్ అండగా ఉంటూ వచ్చారు. ఇక జగన్ విషయానికి వస్తే.. కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొనే రాజకీయాలలోకి వచ్చారు. కడప ఎంపీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వలనే వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. జగన్ మీడియా సంస్థలు స్థాపించారంటే దానికి మూలం కాంగ్రెస్ పార్టీనే ఒక్కో నగరంలో ఒక్కో ప్యాలెస్ కట్టగలిగారంటే అది కూడా కాంగ్రెస్ పార్టీ చలవే వల్లే అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

అనధికారికంగా జగన్ ఇంతటి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారంటే దానికి మూలం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీయే. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ తనకు ద్రోహం చేసిందని జగన్ మోహన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగానే ఉందని పరిశీలకులు అంటున్నారు. అసలు జగన్ ఇప్పుడు సీఎం అయ్యారంటే దానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇక జగన్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారా అన్న అనుమానాలకు సమాధానంగా అవును ద్రోహం చేశారనే పరిశీలకులు చెబుతున్నారు. ఏ రకంగా చూసినా వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటే, జగన్ మాత్రం కాంగ్రెస్ ను మోసం చేశారు. ఆ పార్టీకి ద్రోహం చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -