Amaravathi: అమరావతి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన జగన్.. ఏం చెప్పారంటే?

Amaravathi: తాజాగా ఏపీ సీఎం జగన్ రాజధాని అమరావతి గురించి ఒక సంచలన ప్రకటన చేశారు. ఏపీలో అధికారం చేపట్టి నాలుగేళ్లు గడిచినా కూడా ఏ వేదికపై అమరావతి అనే మాట పలకని సీఎం జగన్ తాజాగా అమరావతి గురించి ప్రస్తావించారు. రాజ‌ధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆర్‌-5 జోన్ లో పేద‌ల‌కు ప‌ట్టాలు ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీనికి అనేక ష‌ర‌తులు కూడా ఉన్నాయన్న విషయం తెలిసిందే. అయితే, ఆయా ప‌ట్టాల పంపిణీ అయిపోయిన ద‌రిమిలా ఇక్క‌డ ఇళ్ల నిర్మాణానికి సీఎం జ‌గ‌న్ శంకు స్థాప‌న చేశారు.

అదేస‌మ‌యంలో కొందరు ల‌బ్ధి దారుల‌తోనూ ప‌నులు ప్రారంభించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. అమ‌రావ‌తిపై వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తి మ‌న అంద‌రిది అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అమ‌రావ‌తి వేర‌ని, ఇప్పుడు ఇది సామాజిక అమ‌రావ‌తిగా మార్పు చెందింద‌ని తెలిపారు. పేదలకు అండగా మార్పు మొదలైందన్న సీఎం జ‌గ‌న్‌ సామాజిక అమరావతిగా మార్పుకు శ్రీకారం చుట్టామ‌ని తెలిపారు. ఇకపై అమరావతి మనందరి అమరావతి అనే భావ‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తామని అన్నారు.

 

అమ‌రావ‌తిని వ్య‌తిరేకించామ‌ని దుష్ట‌చ‌తుష్ట‌యం ప్ర‌చారం చేసింద‌ని కానీ, రాష్ట్రం బాగుండాల‌నే మూడు రాజ‌ధానులు తీసుకువచ్చామ‌ని అన్నారు. అమ‌రావ‌తిలో శాస‌న రాజ‌ధాని ఉంటుంద‌ని ఇది ఎక్క‌డికీ పోదు అని తెలిపారు జగన్. తాము అమ‌లు చేస్తున్న సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోయిందని సీఎం జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. మంచి చేసే కార్యక్రమాన్ని అడ్డుతగలడమే వీరి లక్ష్యమ‌ని ప్ర‌తిప‌క్షాల‌పై నిప్పులు చెరిగారు. అక్క చెల్లెమ్మలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామ‌ని చెప్పారు. కోర్టు కేసులతో దీనినీ అడ్డుకునేందుకు ప్రయత్నించారని విమ‌ర్శ‌లు గుప్పించారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -