CM Jagan: ఏపీ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టిన జగన్.. ఏమైందంటే?

CM Jagan: ఆంధ్రప్రదేశ్లో గత నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతూ ఉన్నప్పటికీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగడంలేదని ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున అధికార నేతలపై విమర్శలు చేస్తున్నారు. కేవలం బటర్ నొక్కుతూ సంక్షేమ పేరిట పెద్ద ఎత్తున డబ్బు దోచుకుంటున్నారని ఆ సంక్షేమ ఫలాలు కూడా ప్రజలకు అందలేదని ప్రతిపక్ష నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేసారని విమర్శలు చేస్తున్నారు.

రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగ యువత పెరిగిపోయారని పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురాలేదని ఉన్నత చదువుల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయని తెలుస్తుంది. ఇలా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి కేంద్రం దగ్గర జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున అప్పులు తీసుకువచ్చారు.

 

ఇది చాలాదు అన్నట్టు మరోసారి ఏకంగా 10,000 కోట్ల రూపాయలకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక రాష్ట్రంలో ఎలాంటి కేంద్ర ప్రాజెక్టులు, పథకాలకు నిధులు అడగబోమని రాసిచ్చి మరీ కేంద్రం నుంచి ఈ రూ. పది వేల కోట్లను జగన్ సర్కార్ తీసుకు వచ్చింది. ఇంతకన్నా రాష్ట్రానికి మరొక దౌర్భాగ్య పరిస్థితి ఏది ఉండదని తెలుస్తోంది.

 

ఇలా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ పదివేల కోట్ల రూపాయలు భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి పనులను అడగడానికి కూడా వీలు లేకుండా చేసిందని పలువురు భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు అలాగే వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇవ్వాల్సిన సహాయం నిధులు ఇవ్వరు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు ఇవ్వరు. ఎలా చూసినా మొత్తం రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోతాయి. ఎలా చూసుకున్న జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును తాకట్టుపెట్టి లబ్ధి పొందారనే వాదన ఎక్కువగా వినపడుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -