జగనన్న ఆరోగ్య సురక్ష.. అలాంటి వాళ్లకు దేవుడైన జగన్.. ప్రజల చేత శభాష్ అనిపించుకుంటూ?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం ఎప్పటికీ ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వాటితో పాటుగా తాజాగా సీఎం జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే ఏపీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ప్రజలందరికీ వైద్య సేవలు అందించాలని అనుకుంటున్నారు. పేదవారికి వృద్ధులకు, ఒక చోట నుంచి కదల్లేని వారికి ప్రతినిధులుగా ఇంటింటికీ వైద్య సిబ్బందిని పంపిస్తున్నారు. ఎవరెవరికి ఏయే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో పరీక్షలు చేసి, అక్కడికక్కడే మందులు ఇచ్చి, అవసరం అయితే పెద్ద ఆస్పత్రికి పంపే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

దీంతో ఇంటింటికి డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది రాకతో ప్రజలకు తమ గుమ్మం ముందే వైద్యం అందుతోంది. సెప్టెంబర్ 30న మొదలైన ఈ బృహత్తర కార్యక్రమం ఇన్ని రోజులుగా కోట్లాదిమందికి సేవలు అందిస్తూ విజయవంతంగా సాగుతోంది. అయితే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 12000 వైద్య శిబిరాలు నిర్వహించగా 60.9 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. అందులో 59. 2 లక్షల మందిని వైద్య సిబ్బంది, డాక్టర్లు పరీక్షించారు. ఇప్పటివరకూ 1. 44 కోట్ల గృహాలను వైద్య సిబ్బంది సందర్శించి 6.4 కోట్ల పరీక్షలు చేశారు. 3.78 కోట్ల మందికి ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టారు.

గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో 13,930 వరకూ శిక్షణ శిబిరాలు నిర్వహించారు. అలాగే 1. 38 కోట్ల కుటుంబాలను వార్డు, గ్రామ వాలంటీర్లు సందర్శించి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకుంటున్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మందికి ఉచితంగా అది కూడా ఇంటి వద్దనే వైద్యాన్ని అందించడంతోపాటు కదల్లేని మెదల్లేని స్థితిలో ఉన్న వారి పట్ల కూడా జగన్ రెడ్డి ఇప్పుడు దేవుడయ్యాడు. కేవలం వారికి మాత్రమే కాకుండా పేదలు నిరుపేదలు, వృద్ధులకు కూడా చికిత్స అందించే విధంగా ఏర్పాట్లును ముమ్మరంగా చేపడుతున్నారు జగన్ మోహన్ రెడ్డి.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -