YS Jagan: జగన్మోహన్ రెడ్డి నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు….!

YS Jagan: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు ఎంతో మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులైన చిరంజీవి, నాగార్జున, బిజెపి నాయకులు ఇలా ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డిని డైరెక్టుగా కలిసో, లేక ఇన్ డైరెక్ట్ గా ఫోన్ చేసి గాని, మెసేజ్ ద్వారా గాని సీఎం అయినందుకు శుభాకాంక్షలు తెలియజేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

 

అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపినట్టుగాని,సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసినట్లు గాని కనబడలేదు. అయితే జగన్ పర్సనల్ గా రేవంత్ తో మాట్లాడారేమో అని అనుకున్నారు ఇప్పటివరకు. కానీ అది కూడా చేయలేదని స్పష్టమైనది. ఈ విషయాన్ని ఎవరో చెప్పలేదు. స్వయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తాను సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కనీసం ఫోన్ చేసి కూడా అభినందనలు తెలియజేయలేదని అన్నారు. ఇది తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. తెలంగాణ అనేది ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ లో భాగం. ఇప్పుడు విడిపోయిన తర్వాత పక్క రాష్ట్రం. రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజలు నాయకులు ఎప్పుడు సోదర భావంతో మెలుగుతూ ఉంటున్నారు. బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి అభినందనలు తెలపకపోవడం నిజంగా ఆశ్చర్యమే.

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు లేక తెలంగాణ వచ్చి బతుకుతున్న ఆంధ్రులు ఎంతో మంది ఉన్నారు. వారందరి తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కి అభినందనలు తెలపాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. కనీసం జగన్ ఇటువంటి మర్యాదలు పాటించకపోవడం మంచి పద్ధతి కాదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడిగా చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇది ఇద్దరు సీఎంల ఆధారపడి ఉంటుంది. ఇద్దరి మధ్య సంబంధాలు ఉంటే ఈ పనులన్నీ చాలా తేలికగా జరుగుతాయి. జగన్ ఎలాంటి వైఖరితో ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి మేలు జగన్ ఎలాంటి వైఖరితో ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి మేలు చేయగలరు జగన్ ఎలాంటి వైఖరితో ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి మేలు జగన్ ఎలాంటి వైఖరితో ఆంధ్ర రాష్ట్రానికి ఏం మేలు చేస్తారని అంటున్నారు.

 

మరోపక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం పాలైతే స్వయంగా హైదరాబాద్ వచ్చి పరామర్శించిన జగన్ కి కనీసం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి అభినందనలు తెలిపే కాలి లేదా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -