Jagan: అప్పులతో రాజకీయాలు చేస్తున్న జగన్ సర్కార్.. మరీ దారుణమంటూ?

Jagan: జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కూబిలో దింపేశారు. ఈయన సంక్షేమ ఫలాలు అంటూ పెద్ద ఎత్తున డబ్బులను ప్రజలకు ఉచితంగా ఇస్తున్నారు అయితే ఈ సంక్షేమ ఫలాలు అందించడం కోసం పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఎన్ని రోజులు ఆరోపణలు చేశారు అయితే తాజాగా ఏపీలో జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుల గురించి కాగ్ అన్ని విషయాలను బయటపెట్టారు.

ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి అభివృద్ధి లేకపోవడంతో రాష్ట్రానికి రావాల్సిన సంపద కరువైంది అంతేకాకుండా ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించడంతో ఖజానాలో నిల్వ ఉండాల్సిన కనీసం నిల్వ కూడా లేకుండా పోయింది దీంతో ప్రతిరోజు ఆర్బిఐ వద్ద చేబదులు చేయడం అలవాటుగా చేసుకున్నారు. ఇక ఈ విషయం గురించి కాగ్ ఎప్పుడో ప్రభుత్వానికి ఎన్నో విధాలుగా చెప్పి చూసారు ఇలా ప్రతిరోజు చేయి బదులు తీసుకొని వడ్డీల రూపంలో పెద్ద ఎత్తున డబ్బును వృధా చేస్తున్నారంటూ మండిపడింది.

 

ఇక ప్రతి నెల ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్న రిటైర్డ్ అధికారులకు పెన్షన్ ఇవ్వాలన్నా కూడా వైఎస్ఆర్సిపి పార్టీ అప్పు కోసం చేతులు చాచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రాన్ని ముందుకు నడిపే విషయంలో ఏ విధమైనటువంటి ప్రణాళిక లేకుండా రిజర్వ్ బ్యాంక్ వద్ద ప్రతిరోజు అప్పు చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి..రాష్ట్ర ఖజానాలో తప్పనిసరిగా 1.94 కోట్ల రూపాయలు నిల్వ తప్పనిసరిగా ఉండాలి. ఇలా ఏపీ ఖజానాలో డబ్బు నిల్వ లేకపోవడమే కాకుండా ఏ విధమైనటువంటి వనరులు సంపదను సృష్టించకపోవడంతో భారీ స్థాయిలో అప్పులు చేశారని కాగ్ నివేదికలను చూస్తే స్పష్టంగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -