Cm Jagan: జగన్ నోట మళ్లీ మూడు రాజధానుల మాట.. మళ్లీ బిల్లు పెడతారా?

Cm Jagan: మళ్లీ మూడు రాజధానులు రానున్నాయా? మరోసారి మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జగన్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన జగన్.. గత మూడేళ్లలో చేపట్టిన డెవలప్ మెంట్, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. అయితే విజయవాడలో జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో జగన్ మాట్లాడుతూ పరోక్షంగా మూడు రాజధానుల గురించి ప్రస్తావించారు.

రాజధాని స్థాయిలో పరిపాలనా వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రాంతీయ అసమానతలకు ముగింపు పలకవచ్చని, అక్కడ ఉన్న ప్రజల ఆకాంక్షలను కూడా తీర్చిదిద్దినట్లు అవుతుందని జగన్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఇటీవల జిల్లాల సంఖ్యను పెంచుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ కోసమే జిల్లాల సంఖ్యను పెంచినట్లు తెలిపారు. ఇప్పుడు పరిపాలనా వీకేంద్రకరణ అంటూ జగన్ మరోసారి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జగన్ ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.

దీనిని బట్టి చూస్తే మరోసారి మూడు రాజధానుల అంశాన్ని జగన్ తెరపైకి తెచ్చినట్లు అర్థమవుతుంది. మరోసారి అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టే అవకాశముందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. గతంలో జగన్ సర్కార్ మూడు రాజధానుల బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీంతో అమరావతి రైతులు భగ్గుమన్నారు. రెండు సంవత్సరాలపాటు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. అలుపెరగకుండా అమరావతి రైతులు ఉద్యమం చేపట్టారు. పోలీస్ కేసులు, అరెస్ట్ లు లెక్క చేయకుండా రైతులు ఉద్యమం నడిపారు. ఈ ఉద్యమానికి ప్రతిపక్ష టీడీపీతో పాటు ఇతర పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి.

అయితే మూడు రాజధానులపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు దాఖలు కావడం, మూడు రాజధానులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వచ్చే అవకాశముందని గ్రహించిన జగన్ సర్కార్.. మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా మూడు రాజధానులు చెల్లదని తీర్పు వెలువరించింది. దీంతో పేర్లు మార్చి జగన్ సర్కార్ త్వరలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టనుందనే ప్రచారం జరుగుతోంది. కానీ మొన్నటివరకు దానిపై ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పుడు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మూడు రాజధానులపై జగన్ పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

మూడు రాజధానులకు కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయడం లేదు. స్వయంగా ప్రధాని మోదీ వచ్చి అమరావతికి శంకుస్థాపన చేశారు. దీంతో బీజేపీ కూడా మూడు రాజధానులను వ్యతిరేకిస్తోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మూడు రాజధానుల బిల్లులను జగన్ సర్కార్ వెనక్కి తీసుకుంది. అయితే ఇప్పుడు మరోసారి ఆ బిల్లును ప్రవేశపెట్టాలని చూస్తోంది. త్వరలో విశాఖకు జగన్ మకాం మారుస్తారని వార్తలు వస్తున్నాయి. మంచి ముహూర్తం చూసుకుని విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టి పాలన చేస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలతో ఆ వార్తలు నిజమయ్యేలా ఉన్నాయి. మూడు రాజధానులపై వెనక్కి తగ్గేలా జగన్ కనిపించడం లేదు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం కూడా సుముఖంగా ఉంది. మూడు రాజధానులు ముగిసిన అధ్యాయమని ప్రతిపక్షాలు చెబుతున్నా.. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి మూడు రాజధానులపై చర్చ తెరపైకి వచ్చింది. అయితే మూడు రాజధానులు కోర్టులో చెల్లవని, మరోసారి అమరావతి రైతులు కోర్టులకి వెళితే జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బలు తప్పవని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉండటంతో మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడితే అమరావతి రైతుల ఉద్యమం మళ్లీ మొదలయ్యే అవకాశముంది. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం రిస్క్ చేస్తుందా అనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -