Padayatra: గుంటూరు జిల్లాలో జగన్ పాదయాత్ర నెలన్నర.. లోకేశ్ పాదయాత్ర ఐదు రోజులు.. ఇదీ పాదయాత్రేనా?

Padayatra: ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది నెలలలో ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఒకవైపు జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలను అందిస్తూ మీకు న్యాయం చేశాను మంచి చేశాను అనిపిస్తే తిరిగి నన్ను ఆశీర్వదించండి అంటూ పలు కార్యక్రమాలలో తెలియజేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ద్వారా యాత్రలో భాగంగా ప్రజలలోకి వెళ్తూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు.

 

ఇక తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేష్ వచ్చే ఎన్నికలలో ఎలాగైనా తిరిగి తమ ప్రభుత్వానికి పట్టం కట్టాలంటూ ఈయన ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి యువగళం పాదయాత్ర చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం జనవరి నెలలో ప్రారంభించారు. అయితే తాజాగా లోకేష్ పాదయాత్ర గురించి ఎన్నో రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి మహిళ అధ్యక్షురాలు ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ లోకేష్ పాదయాత్ర గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.గతంలో జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో దాదాపు నెలన్నర రోజుల పాటు పాదయాత్ర చేశారు అలాంటిది లోకేష్ మాత్రం కేవలం ఐదు రోజులలో పాదయాత్ర ఎలా పూర్తి చేశారు. ఇది ఎలా సాధ్యమైనదని ఈమె ప్రశ్నించారు.పాదయాత్ర ఐదు రోజులలో ముగించారు అంటే ఈయన పాదయాత్రకు వస్తున్నటువంటి ఆదరణ ఏంటో అర్థం అవుతుంది.

 

లోకేష్ పాదయాత్రకు పెద్దగా మద్దతు రాకపోవడంతోనే ఈయన ప్రజలను ఆకర్షించడానికి ఉదయభాను ఉండవల్లి శ్రీదేవి సాయి రాజేష్ వంటి వారిని వ్యాఖ్యాతగా నియమిస్తూ ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఇక లోకేష్ కి కూడా తన పాదయాత్ర పై పూర్తిగా నమ్మకం కోల్పోయారని ఈమె వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ నెలన్నర రోజులపాటు గుంటూరు జిల్లాలో పాల్గొన్నారు.

 

ఇలా జగన్మోహన్ రెడ్డి నెల చేసినటువంటి పాదయాత్రను లోకేష్ 5 రోజులకే పూర్తి చేయడం నన్ను కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని ఈమె తెలిపారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ఇన్చార్జీలు ఎమ్మెల్యేలను ఆయన తన పక్కన పెట్టుకొని మరి బహిరంగ సభలను నిర్వహించారు అలాగే జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనలో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ లోకేష్ మాత్రం అలా కాదు సినిమా సెలబ్రిటీ లాగా మొదటి రోజు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారని ఆయన మనిషిలో కూడా ఎలాంటి మార్పులు రాలేదు అంటూ ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -