Kakinada Lok Sabha: కాకినాడ లోక్ సభ రివ్యూ.. ఎక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే?

Kakinada Lok Sabha: కాకినాడ ఎంపీ స్థానం ఈసారి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ ఏ పార్టీ అయినా కాపు అభ్యర్థికే టికెట్ ఇస్తుంది. దీన్ని ఓ రకంగా అప్రకటిత కాపు రిజర్వుడ్ నియోజవర్గంగా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి విజేతలు మారుతూ ఉన్నా.. రెండో స్థానంలో ఉన్న వ్యక్తి మాత్రం మారడం లేదు. అతనే చలమలశెట్టి సునీల్. పార్టీలు మారినా.. ఆయనకు కాకినాడ టికెట్ కన్ఫామ్. అంతేకాదు.. ఓటమి కూడా కన్పాన్ అనేలా ఆయన గత ఎన్నికల ప్రస్థానం కనిపిస్తోంది. ఇప్పటికే మూడు సార్లు ఆయన మూడు పార్టీల తరుఫున కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేశారు. కానీ, ప్రతీసారి ఆయన తక్కువ మెజార్టీతో ఓడిపోతున్నారు. 2014లో వైసీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి కూడా వైసీపీ తరుఫునే పోటీ చేస్తున్నారు. ఆయనకు ఉన్న నమ్మకం అంతా మూడు సార్లు ఓడిపోయామనే సానుబూతి కలిసి వస్తుందని అనుకుంటున్నారు. దానికి తోడు ఆర్థికంగా బలమైన వ్యక్తి. కానీ, మిగిలిన అన్ని ఫ్యాక్టర్స్ కూడా ప్రతికూలంగానే ఉన్నాయి.

కాకినాడ ఎంపీ స్థానం పరిధిలో తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పెద్దాపురం, జగ్గంపేట స్థానాలు ఉన్నాయి. ఈ ఏడు స్థానాల్లో కూడా వైసీపీ అంతంత మాత్రంగానే ఉంది. గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో కూడా అత్తెసరు మెజార్టీతోనే ఈస్థానాల్లో గెలిచింది. మరోవైపు పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయడం కూడా కాకినాడ ఎంపీ స్థానంలో వైసీపీకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. జగ్గంపేట, ప్రతిపాడు స్థానాలను వైసీపీ సడెన్ గా మార్చడం మరింత ఇబ్బందిని తెచ్చి పెట్టింది. ఈ ఏడు అసెంబ్లీ నియోజవర్గాల్లో వైసీపీలో ఉన్న సిట్టింగులు టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారనే చర్చ కూడా ఉంది. దానికి తోడు గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన కలయిక కూటమికి ఎదురులేని మెజార్టీ తెప్పింస్తుందని అంటున్నారు. కానీ, వైసీపీ మాత్రం.. ఈ రెండు పార్టీల మధ్య ఓట్లు బదలాయింపు జరగదు అని బలంగా నమ్ముతుంది. ఈయన కాపు సామాజిక వర్గాని చెందిన నేత అయినప్పటికీ.. వైసీపీ నేతల పవన్ ను పదేపది తిట్టించడం సునీల్ కు ఎంతో కొంత నష్టం చేస్తుందని భావిస్తున్నారు.

ఇక.. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా కూటమి నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. ఆయన జనసేన నేత. ఆయనకు రాజకీయాలు కొత్త. కానీ, టీడీపీ, జనసేన పొత్తులో ఉండటం ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు.. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుంది. పవన్ కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కనుక దాని ప్రభావం గట్టిగా పని చేస్తుంది. అయితే, ఆయన రాజకీయాలకు కొత్త కావడంతో టీడీపీ నేతలపైనే ఆధారపడ్డారు. టీడీపీ నేతల కాస్త మనసుపెట్టి పని చేసినా.. కాకినాడలో జనసేన జెండా ఎగరడం ఖాయం. సునీల్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ప్రత్యర్థి గెలుపు ఖాయమని సెటైర్లు పడుతున్నాయి. అంతేకాదు.. ఆయనతో పాటు ఆయన పోటీ చేస్తున్న పార్టీ కూడా ఓటమి ఖాయమని అంటున్నారు. కూటమి అభ్యర్థి అన్ని రకాలుగా బలంగా ఉన్నారు. వైసీపీకి ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఫలితం సునీల్ పైనే ఆధారపడి ఉంది. ఇప్పటికే మూడు సార్లు ఓడిపోయారు అనే సానుభూతి పని చేస్తుందా? లేకపోతే ఏం చేసినా సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తారా? చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -