Sharmila: షర్మిలపై ఇంత విషం కక్కాలా సాక్షి.. అప్పుడు మీ పత్రికే పొగిడిందిగా!

Sharmila: షర్మిల ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడంతో ఆమెపై బురదజల్లే ప్రయత్నం చేయిస్తున్నారు వైఎస్ జగన్. కొండా రాఘవరావు వైయస్సార్ అభిమానిని అంటూ వైఎస్ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైయస్ షర్మిల రెడ్డి ని మురుసుపల్లి షర్మిల శాస్త్రిగా ప్రజలకు పరిచయం చేయడం పట్ల షర్మిల పై బ్లూ మీడియా ఎంతటి ఆక్రోసాన్ని నింపుకుందో అర్థమవుతుంది. వైయస్ భారతి రెడ్డి చేయవలసిన పాదయాత్ర తాను చేస్తానంటూ ప్రకటించినప్పుడే ఆమె మనసులో విషం నింపుకుంది అంటున్న కొండారెడ్డి కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

 

నాలో నాతో అనే పుస్తకంలో విజయలక్ష్మి కూడా ఆమె వివాహం విషయంలో తన తండ్రి వైఎస్ఆర్ చేతే కంటతడి పెట్టించిన మహాతల్లి షర్మిల అంటూ చెప్పారు. ఆమె అహంకారి ఎన్నో అబద్ధాలు చెబుతూ ఊసరవెల్లి సిగ్గుపడేలా షర్మిల ప్రవర్తిస్తున్నారు అంటూ షర్మిలపై విలువలతో కూడిన విమర్శలతో సొంత చెల్లిపై డిబేట్ లు చేస్తుంది సాక్షి మీడియా.

షర్మిల జగమొండి అని విజయలక్ష్మిని తనకు చెప్పిందని బ్రదర్ అనిల్, షర్మిల బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడితే అందుకు జగన్ అంగీకరించకపోవడంతో ఇటువంటి దుర్మార్గపు పనులు చేస్తోందంటూ షర్మిలను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు కొండా రాఘవరెడ్డి. తెలంగాణలో షర్మిల పెట్టిన వైఎస్ఆర్ టీపీ లో జాయిన్ అయ్యి ఆ పార్టీ తరఫున తెలంగాణలో పోటీ చేయడానికి సిద్ధపడ్డ కొండ రాఘవరెడ్డికి షర్మిల వైఎస్ కాదు మురుసుపల్లి అని అప్పుడు తెలియదా అంటూ నిలదీస్తున్నారు ప్రతి పక్షవర్గం వారు.

 

ఓకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు వారి వారి ఆలోచనలు అవసరాలు మేరకు వేరువేరు రాజకీయ పార్టీల తరఫున పనిచేయవచ్చు అది వారి వ్యక్తిగతం చంద్రబాబు కుటుంబ సభ్యులైన పురందరేశ్వరి బీజేపీ కి ఆయన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండేవారు. అలా అని కుటుంబ సభ్యులపై విలువలు గాలికి వదిలేసి ఇలా దిగజారుడు వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదు అంటూ జగన్ పై విరుచుకుపడుతున్నారు ప్రతిపక్ష వర్గం వారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -