Karan Reddy: జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా చెరకు కరణ్ రెడ్డి.. విజయం తథ్యమంటూ! 

తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. మరి త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు  జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో మరోసారి ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థికి ఎక్కడ టికెట్ ఇస్తారు అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి స్థానంపై అందరి ఆసక్తి ఉంది.

ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల పైన అందరి అభ్యర్థుల ఆసక్తి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బరిలో పోటీ చేయడం కోసం అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. అయితే తాజాగా బీజేపీ పార్టీ నుంచి ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం కోసం చెరుకు కరణ్ రెడ్డి బరిలో ఉన్నారని తెలుస్తుంది.

బిజెపి పార్టీ నుంచి ఈయన ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు అంతేకాకుండా ఈయన ప్రముఖ ఆధ్యాత్మికవేత్తగా రాజకీయ నాయకుడిగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఎంతో ఆప్తుడు. గత రెండు దశాబ్దాలుగా బిజెపి పార్టీతో ఎంతో అనుబంధం ఉన్నటువంటి కరణ్ రెడ్డికే జహీరాబాద్ టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు.

కరణ్ రాజకీయ వ్యూహకర్తగానూ ఎంతో మంది నాయకులను ఎమ్మెల్యేలుగా..ఎంపీలుగా గెలిపించారు.. తెలంగాణలో పదేళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీకి..ఆంధ్ర ప్రదేశ్ లోని వైఎస్సార్సీపీ కి సైతం వ్యూహ కర్తగా వ్యవహరించారు. ఇలా రాజకీయాలలో ఎంతో అనుభవం కలిగినటువంటి కరణ్ రెడ్డిని బిజెపి ప్రభుత్వం జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ పడుతున్నట్లు సమాచారం.. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయం గురించి త్వరలోనే అధికారకంగా ప్రకటన వెలబడనుంది.

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: అలా జరిగి ఉంటే ఓట్లు అడిగేవాడిని కాదు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!

Nara Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం సభలో మాట్లాడారు. జగన్ పాలన గురించి మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి...
- Advertisement -
- Advertisement -