CM KCR : 3న కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? కీలక నిర్ణయం తీసుకుంటారా?

CM KCR: ఈ నెల 3వ తేదీపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్ఎల్పీ సమావేశంతో పాటు కేబినెట్ మీటింగ్ ఆ రోజు జరగనుంది. ఒకేరోజు రెండు కీలక సమావేశాలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుండటంతో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఒకేరోజు రెండు సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేశారనేది హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు.

ఒక అదే రోజు కేబినెట్ మీటింగ్ జరగనుంది. దీంతో ఒకేరోజు రెండు సమావేశాలు కేసీఆర్ ఎందుకు పెట్టారనేది హాట్ టాపిక్ గా మారింది. ముందస్తు ఎన్నికల నిర్ణయం తీసుకోవడం కోసమే ఒకేరోజు టీఆర్ఎస్ఎల్పీ సమావేశంతో పాటు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారననే ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్నాయి. టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో నేతలతో ముందస్తు ఎన్నికలపై చర్చింనున్నారని, ఆ తర్వాత కేబినెట్ లో దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారనే చర్చ నడుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా.. లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే తెలంగాణలో బీజేపీ క్రమక్రమంగా బలపడుతోంది. మరింత అవకాశం ఇస్తే వచ్చే ఏడాదిలోపు పుంజుకుంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ముందస్తు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా మీడియాలో మాట్లాడిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇక ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు కూడా పరోక్షంగా ముందస్తు ఎన్నికలపై వ్యాఖ్యలు చేశారు. దీనిని బట్టి చూస్తే ముందస్తు ఎన్నికలు వస్తాయా అనే చర్చ జరుగుతోంది.

మూడో తేదీన కేసీఆర్ టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పార్టీ నేతలకు ఎలాంటి రూట్ మ్యాప్ ఇవ్వబోతున్నారు.. ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు. కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఇప్పుు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ముందస్తు ఎన్నిలకు తాము కూడా సిద్దమని తెలంగాణ బీజేపీ నేతలు చెప్పారు. దీంతో ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారా.. లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. లేకపోతే ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతున్న క్రమంలో దానిప ఏమైనా క్లారిటీ ఇస్తారా అనే దాని కోసం కడా వేచి చూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -