Cm KCR: నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం.. క్రేందంపై ఇదే మా నిరసన!

Cm KCR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దిల్లీలో ఆదివారం జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించడం చాలా బాధాకరమే అయినప్పటికీ ప్రజాస్వామ్య కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలియజేయడానికి ఇదే ఉత్తమ మార్గమని తెలిపారు.

ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ ద్వారా తన నిరసన తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. లేఖ ద్వారా నేరుగా ప్రధానికి నేరుగా తన నిరసనను తెలియజేస్తున్నామని తెలిపారు. మిషన్‌ భగీరథకు రూ.19,500 కోట్లు గ్రాంట్‌, మిషన్‌ కాకతీయకు రూ. 5 వేల కోట్లు గ్రాంట్ ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసినట్లుగా వివరించారు. నిధుల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

స్వాతంత్ర్యం తర్వాత ఏం చేయాలని అనేదానిపై జరిగిన చర్చోపచర్చల ఫలితంగానే ప్లానింగ్‌ కమిషన్ ఆఫ్‌ ఇండియా ఏర్పడిందన్నారు. కమిషన్ సిఫార్సులతో  కేంద్రం ప్రణాళికలు రూపకల్పన చేసి.. సమస్యలు వ్యవహరించాలన్నారు,  నెహ్రూ ప్రధాని అయిన తర్వాత ప్లానింగ్‌ కమిషన్‌ ఆఫ్‌ భారతదేశంలో అమల్లోకి వచ్చిందని.. ఇందులో ఎందరో మహానుభావులు సభ్యులుగా ఉన్నారన్నారు. దేశానికి అభివృద్దికి కీలక నిర్ణయాలు ప్రణాళిక సంఘం తీసుకునేదని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -