KCR: అదే ఫార్ములాతో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ మళ్లీ ఫోకస్?

KCR: తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రత్యామ్నాయంగా బలంగా మారుతున్న కాషాయ పార్టీకి రాష్ట్రంతో పాటు దేశంలోనూ చెక్ పెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దుబ్బాక ఎన్నికల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ తీరును గట్టిగా విమర్శిస్తున్న కేసీఆర్.. టీఆర్ఎస్ శ్రేణులతో రాష్ట్రంలో కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేయించారు. అంతేకాదు రైతుల పక్షాన ధాన్యం కొనుగోలుపై ఏకంగా ఢిల్లీలో సీఎం కేసీఆర్ ధర్నాకు దిగారు. మోదీ, బీజేపీ టార్గెట్ గా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు మోదీది అసమర్ధ పాలన అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. ఏ బహిరంగ సభకి వెళ్లినా, మీడియా సమావేశం ఏర్పాటు చేసినా సరే.. బీజేపీ టార్గట్ గా విమర్శనస్త్రాలను సంధిస్తూ విమర్శలు దాడికి దిగుతున్నారు.

అయితే రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా బీజేపీకి చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ పెద్ద ప్లాన్ వేశారు. రైతు సమస్యలే లక్ష్యంగా కేంద్రంపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న తరహాలోనే రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ బీజేపీ దూకుడుకు అడ్డకట్ట వేయవచ్చని సరికొత్త ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం రైతు సమస్యలనే ఓ అస్త్రంగా మలుచుకునే పనిలో కేసీఆర్ నిమగ్నమయ్యారు. తాజాగా రెండు రోజుల పాటు ప్రగతిభవన్ లో అఖిల భారత రైతు సంఘాలతో పాటు దేశంలోని అన్ని రైతు సంఘాల నాయకులతో సీఎం కేసీఆర్ భేటీ బీజేపీని ఇరుకున పెట్టడంలో భాగమేనని తెలుస్తోంది.

రైతులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, చట్టసభల్లో రైతులు అడుగుపెట్టాలని కేసీఆర్ తెలిపారు. రైతులు రాజకీయంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైతు ఉద్యమాలను, రాజకీయ ఉద్యమాలను కలపాలని సూచించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల దేశంలోని రైతులు క్లిష్ట పరిస్ధితులను ఎదుర్కొంటున్నారని, అందరూ కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమం తరహాలో దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమం చేపట్టాలని ఉందని నొక్కిచెప్పారు.

కేసీఆర్ మాటలను బట్టి చూస్తుంటే రైతులను అడ్డుపెట్టుకుని సెంటిమెంట్ రగిల్చే పనిలో కేసీఆర్ ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టంను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసినవారిలో కొంతమంది మరణించారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి తెలంగాణ ప్రభుత్వం తరపున ఆ రైతు కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేశారు. ఇక అప్పట్లో కేంద్ర కొత్త వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్లమెంట్ లో గళమెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది.

ఇవన్నీ చూస్తుంటే రైతు సమస్యలే లక్ష్యంగా చేసుకుని త్వరలో మళ్లీ అన్ని రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రకటించే అవకాశముంది. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల్లో రైతు సంఘాల నాయకులతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. దీనికయ్యే ఖర్చు కూడా కేసీఆర్ భరించనున్నారు. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు కేసీఆర్ ప్రకటించగా.. ఎన్నికల నాటికి కొత్త పార్టీని ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే ఢిల్లీ వేదికగా దేశవ్యాప రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బీజేపీ సర్కార్ వెనక్కి తగ్గేలా చేశారు.

రైతులకు బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా ఉంది. ఉత్తరాది రైతుల్లో అయితే ఇది మరింతగా ఉంది. దీంతో రైతు ఎజెండాతో దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె తరహాలో సకల రైతుల సమూహారంగా రైతులతో కలిసి ఆందోళనలకు ప్లాన్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -