CM KCR: బీఆర్ఎస్ ఆవిర్భాస సభపై కేసీఆర్ కీలక నిర్ణయం.. ఢిల్లీ గడ్డపై సమరశంఖం

CM KCR: విజయదశమి రోజును టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చుతూ పార్టీ నేతల సమక్షంలో కేసీఆర్ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. నేషనల్ పాలిటిక్స్ లో మోదీకి వ్యతిరేకంగా చక్రం తిప్పాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. బీఆర్ఎస్ కు జాతీయ పార్టీ హోదా రావాలంటే ఇతర రాష్ట్రాల్లో కూడా సీట్లను గెలుచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో బీజేపీ బలంగా ఉంది. కాంగ్రెస్, సీపీఎం, సీబీఐ లాంటి పార్టీలు ఉన్నాయి. వామపక్ష పార్టీలే జాతీయ హోదాను కోల్పోతున్నాయి. కేరళలో మాత్రమే వాపపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి.

మిగతా రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీలు ఉనికిని కోల్పోతున్నాయి. ఇక అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. జాతీయ రాజకీయాలల్లో ఇప్పటికే మమతా బెనర్జీ, శరద్ పవార్, నితీష్ కుమార్ లాంటి నేతలు బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారందరూ ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్ధిగా పోటీకి రేసులో ఉన్నారు. అలాంటప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సక్సెస్ అవుతారా.. మోదీని ఢీకొట్టగలుగుతారా అనేది మిలియన్ల డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికే కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్ పార్టీ మెల్లమెల్లగా ఇతర రాష్ట్రాల్లో అధికారంలో దక్కించుకుంటూ జాతీయ పార్టీగా ఎదుగుతుంతుంది. కానీ తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా రావాలని, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి సక్సెుస్ అవుతారంటూ ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ సమూల మార్పులు తీసుకొస్తారంటూ చెప్పుకొస్తున్నారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ దృష్టి పెట్టారు. గత మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ నిర్మాణంపై పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పర్యటనలో్ కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6న ఢిల్లీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తోన్న్లు తెలుస్తోంది. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంతో ఈ సభను ఏర్పాటు చేసే అవకాశముందని తెలుస్తోంది. సభ ఏర్పాటుపై చర్యలు చేపట్టాలని, గ్రౌండ్ ను పరిశీలించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించినట్లు సమాచారం.

ఈ సభకు దేశంలోని రైతు సంఘాలు, దళిత సంఘాల నేతలను కూడా ఆహ్వానించే అవకాశముందని తెలుస్తంోది. అలాగే కొన్ని పార్టీలు బీఆర్ఎస్ లో విలీనం అయ్యేలా ఈ సభలో ప్రకటన చేస్తాయని చెబుతున్నారు. ఈ సభకు కోసం హైదరాబాద్ నుంచి కేసీఆర్ రోడ్డు మార్గంలో ఢిల్లీకి వెళతారని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కారులో ర్యాలీగా వెళ్లారు. ఇపపుడు కూడా అదే తరహాలో వెళ్లేలా కేసీఆర్ ఆలోచన చేస్తోంది. బీఆర్ఎస్ ను దేశ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు, బీఆ్ఎస్ కు బలంగా పునాదులు వేసేందుకు ఢిల్లీ సభను కేసీఆర్ వేదికగా మర్చుకోనున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -