KCR-Naresh: సీనియర్ నరేష్ నోరు మూయించిన కేసీఆర్.. ఏమైందంటే?

KCR-Naresh: అపట్లో మా ఎన్నికలు, మూడు పెళ్లిళ్లు, ఇప్పుడు పవిత్రా లోకేశ్‌తో సహజీవనం అంశాలతో సీనియర్ నటుడు, దివంగత విజయనిర్మల కుమారుడు నరేశ్ ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. అతన్ని నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు, మరణించిన తర్వాత నరేశ్ చేసిన హడావుడిపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్‌తో నరేష్ ఉన్న ఒక వీడియోను వైరల్ చేస్తూ ఎందుకింత అతి అంటూ విమర్శిస్తున్నారు.

ఇక చాలు ఆపు.. అన్నట్లు కేసీఆర్ సైగలు
కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. నివాళి అర్పించిన తరవాత ఘట్టమనేని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మహేష్ బాబును ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు. మహేష్, నమ్రత దంపతుల వద్దే కాసేపు కూర్చొని మాట్లాడారు. ఈ సమయంలో కేసీఆర్ ఎదుటే నమ్రతతో నరేష్ ఏదో చెప్పబోయారు. వెంటనే కేసీఆర్ నరేష్ చేయిపట్టుకుని ‘ఇక చాలు ఆపు’ అన్నట్టుగా సైగ చేశారు. వారు బాధలో ఉంటే నీ మాటలేంటి? అన్నట్లుగా కేసీఆర్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. దీంతో ఈ వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గత మూడు రోజులుగా కృష్ణ చికిత్స తీసుకుంటున్న కాంటినెంటల్ హాస్పిటల్‌కు, తర్వాత కృష్ణ ఇంటికి పవిత్రా లోకేష్‌తో కలిసి వెళ్లడం.. అక్కడ ఆమెతో నరేశ్ తిరగడంపై కూడా కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. విషాద సమయంలో వీరి ఓవరాక్షన్ ఏంటంటూ అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన్ను కొందరు సపోర్ట్ చేస్తున్నారు. కృష్ణ కుటుంబంతోనే నరేష్‌ బాగా కలిసిపోయారని, అన్ని విషయాల్లో అండగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. కృష్ణ హాస్పిటల్‌లో చేరినప్పటి నుంచీ నరేష్ అక్కడే ఉన్నారు. కృష్ణ ఆరోగ్యంపై మీడియాకు అప్‌డేట్ కూడా ఇచ్చారు. ఇక నటశేఖరుడు చనిపోయిన తరవాత ఏర్పాట్లను నరేష్ దగ్గరుండి చూసుకున్నారు. ఇవన్నీ ట్రోలర్స్‌కు గుర్తు లేవా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

మా ఎన్నికల్లో వివాదాల తర్వాత నరేశ్‌ బాగా సోషల్ మీడియాలో వైరలవుతున్నాడు. తను అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగాక.. మంచు విష్ణుకు సపోర్ట్ చేయడం, ఆ సందర్భంగా చేసిన కొన్ని కామెంట్లు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని, అందరికీ విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు పవిత్రా లోకేశ్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఆ మధ్య బెంగళూరులో పవిత్రతో హోటల్ రూమ్‌లో ఉండగా, మూడో భార్య అక్కడికివచ్చి తీవ్ర విమర్శలు చేసింది. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: చంద్రబాబు స్టామినాకు ఫిదా అవ్వాల్సిందే.. ఏడు పదుల వయస్సులో చెలరేగిపోతున్నారుగా!

Nara Chandrababu Naidu:  ఏపీలో ఎన్నికలవేళ పార్టీ ప్రచారాల జోరు ఊపందుకున్న నేపథ్యంలో అందరి దృష్టి చంద్రబాబు నాయుడు మీద పడటం గమనార్హం. చంద్రబాబు నాయుడు లో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.....
- Advertisement -
- Advertisement -