Chiranjeevi : మెగాస్టార్ బ్లడ్ బ్యాంక్ ఆలోచన రావడానికి అదే కారణమా?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి స్వయం కృషితో అడుగుపెట్టి ఎవరి సహాయ సహకారాలు లేకుండా అంచలంచలుగా ఇండస్ట్రీలో ఎదుగుతూ నేడు ఇండస్ట్రీలో గొప్ప హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఎంతో మంచి మనసున్న వ్యక్తిగా కూడా ఈయన పేరు ప్రఖ్యాతలు పొందారు. స్టార్ హీరో అయినప్పటికీ ఎంతో ఒదిగి ఉండే వ్యక్తిత్వం చిరంజీవిది.

ఈయన ఇలా గొప్ప నటుడు అయినప్పటికీ ఒక సామాన్యమైన వ్యక్తిలా వ్యవహరించడమే కాకుండా ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఎందరికో ప్రాణదానం చేస్తున్నారు. ఇప్పటికే ఈయన మెగాస్టార్ బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ వంటి వాటిని స్థాపించి ఎంతోమందికి ప్రాణదానం చేశారు. ఎంతోమంది జీవితంలో వెలుగులు నింపారు. అయితే మెగాస్టార్ స్థాపించిన బ్లడ్ బ్యాంక్ ఎంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

ఈ విధంగా ఇలాంటి ఒక బ్లడ్ బ్యాంక్ స్థాపించాలనే ఆలోచన మెగాస్టార్ చిరంజీవికి ఎలా వచ్చింది? ఈ బ్లడ్ బ్యాంక్ స్థాపించడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. ఒకరోజు పేపర్లో సరైన సమయానికి రక్తం లభించగా చనిపోయిన వారి గురించి చదివిన మెగాస్టార్ చిరంజీవి మనసు ఎంతగానో బాధపడిందట.ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తుండగా ఆ ఆలోచనలో నుంచి పుట్టినది బ్లడ్ బ్యాంక్ అని చెప్పారు.

ఇలా ఓ చిన్న ప్రయత్నంగా తాను బ్లడ్ బ్యాంక్ స్థాపిస్తున్నానని చెప్పడంతో ఎంతో మంది అభిమానులు తనకు అండగా నిలబడి ఈ బ్లడ్ బ్యాంక్ వ్యవస్థను విజయవంతంగా ముందుకు నడిపారని ఈయన వెల్లడించారు. ఇప్పటికీ నిత్యం ఎంతోమంది అభిమానులు ఈ బ్లడ్ బ్యాంకుకు రక్తదానం చేస్తున్నారు.ఇక మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మాత్రమే కాకుండా మెగా కుటుంబంలోని హీరోల పుట్టినరోజులు వస్తే పెద్ద ఎత్తున అభిమానులు రక్తదానం చేస్తూ ఎంతోమందికి సరైన సమయంలో రక్తం అందించి వారి ప్రాణాలను కాపాడుతున్నారు.ఇలా ఈయన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -