Kodali Nani: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని..

Kodali Nani: గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని తన భాషతో బాగా ప్రాచుర్యం పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులను తనకు నోటికు వచ్చినట్టు మాట్లాడటం ఆయన స్పెషాలిటీ. తాజాగా ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు సంగతి ఏంటంటే…రేవంత్ రెడ్డి తను సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కనీసం ఫోన్ చేసి కూడా విషెస్ చెప్పలేదని చెప్పారు… పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా శుభాకాంక్షలు చెప్పడం అనేది కనీస సంప్రదాయం అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన కొడాలి నాని స్పందించారు.తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…

 

రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ తీసుకోవాల్సిన అవసరం మాకేంటి? అని కొడాలి నాని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల అపాయింట్ మెంట్లు మాకు అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు సీఎం జగన్ ట్వీట్ చేశారు కదా.. మళ్లీ ఫోన్ చేసి అభినందించాలా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ సీఎం జగన్ ఫోన్ చెయ్యలేదని, కనీసం విషెస్ కూడా తెలపలేదని కొందరు కాంగ్రెస్ నాయకులు చేసిన కామెంట్స్ పై స్పందించిన కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు.

“మేము ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నామా? తెలంగాణలో కూర్చుని పని చేయటానికి? కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సీఎం జగన్ ది ఏమైనా కాంగ్రెస్ పార్టీనా? తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు. అక్కడున్న పార్టీని కూడా తీసేసి ఏపీకి వచ్చేశాము. వైసీపీని ఆంధ్రప్రదేశ్ కే పరిమితం చేశాం. తెలంగాణలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అన్నది మాకు సంబంధం లేని విషయం.జగన్ ఎగబడరు, దూరంగా ఉండరు. ఆయన లిమిట్స్ లో ఆయన ఉంటారు. రేవంత్ రెడ్డి అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ లో పెట్టారు.

 

ఫోన్ చేసి అభినందకపోతే ఏమైంది? కేసీఆర్ కి తుంటి విరిగింది కాబట్టి ఆయనను జగన్ పరామర్శించారు. రేవంత్ రెడ్డికి తుంటి ఏమీ విరగలేదు కదా? జగన్ ఆయనను పరామర్శించడానికి. రేవంత్ రెడ్డి అపాయింట్ మాకు అవసరం లేదు. రేవంత్ రెడ్డిది ఏమైనా ప్రాంతీయ పార్టీనా? రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీమా? పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను పట్టించుకోని టీం జగన్ వద్ద లేదని చంద్రబాబులాగే ప్రతిదీ తానే చేశానని చెప్పుకునే అలవాటు జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పారు. అయితే కొడాలి నాని వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -