Kodali Nani: సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి.. గుడివాడలో కొడాలి నానికి భారీ షాక్ తప్పదా?

Kodali Nani: వైసీపీలో కీలకమైన నేతలుగా చెప్పుకుంటున్న వారందరికీ అధినేత జగన్ వరుసగా షాకులు ఇస్తున్నారు. ఎవరైతే చంద్రబాబు, పవన్, లోకేష్ ను భూతులు తిట్టారో.. ఎవరైతే ప్రతిపక్షాలపై ఒంటికాలిపై లేచే వారో.. ఎవరైతే జగన్ ను దేవుడుగా భావించారో వారందరినీ సైడ్ చేస్తున్నారు. జగన్ పై ఈగ వాలితే.. పేర్నినాని తనపై బాంబు పడినట్టు ఫీల్ అయ్యేవారు. అందుకే, వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబు, పవన్‌ను ఇష్టమొచ్చినట్టు తిట్టేవారు. కాపు సామాజికవర్గానికి చెందిన ఈ నేత.. జనసేనపై కాపులు ఎవ్వరు వెళ్లకుండా వీలైనంత డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాన్ కు చెప్పులు చూపించారు. అయితే, జగన్ మొదటి ఆయన సీటే చింపేశారు. ఆ విషయాన్ని ముందే గ్రహించిన పేర్నినాని.. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. తన కొడుకు పోటీ చేస్తారని చెప్పారు. పేర్నినాని చాలా జాగ్రత్తగా పరువు పోగొట్టుకున్నా.. మర్యాద కాపాడుకున్నాడు. పార్టీ అధిష్టానం టికెట్ లేదని చెబితే ప్రజల్లో చులకన అయిపోతాడు కనుక.. ఈ విషయాన్ని గ్రహించి ఆయనే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అని ప్రకటించుకున్నాడు.

ఆ తర్వాత పవన్ కల్యాణ్‌ను తిట్టడానికి ఎక్కడా లేనంత హుషారుగా ప్రెస్‌మీట్ పెడతాడు మంత్రి అమర్ నాథ్. ఐటీ మంత్రిగా మీరు ఏం చేశారు అంటే.. గుడ్డు, కోడి తప్పా ఇంకేం చెప్పలేదు ఈ మంత్రి. కానీ, సొంత సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ ను మాత్రం నోటికొచ్చిన భూతులు తిట్టాడు. సీన్ కట్ చేస్తే.. ఆయనకు కూడా సిట్టింగ్ స్థానంలో నో టికెట్ బోర్డు పెట్టేశారు జగన్. వేరే స్థానంలో టికెట్ ఇస్తారా అంటే.. అది కూడా అనుమానంగానే కనిపిస్తోంది. అయితే, మంత్రి అమర్ నాథ్ మాత్రం పరువు, మర్యాద.. రెండూ పోయినా.. ఇంకా జగన్ బజన చేస్తూనే ఉన్నారు. అందుకే, టికెట్ రాకపోయినా.. జగన్ దగ్గర బంటులా ఉంటానని చెప్పారు. మరి ఎన్ని రోజుల ఆ బంటులా ఉంటారో చూడాలి.

ఆ తర్వాత.. వైసీపీలో ఐరన్ లేడీ మంత్రి రోజా.. ఆమె చంద్రబాబు, పవన్, లోకేష్ ఎవరైనా ఒకటే.. నాన్ స్టాప్ బ్యాటింగ్ ఆడేస్తుంది. సినిమా డైలాగ్స్‌ని మిక్స్ చేసి పొలిటికల్ ఎంటర్‌టైన్మెంట్ చూపిస్తుంది. అయితే, రోజాకు కూడా టికెట్ కట్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఆమె కూడా టికెట్ తో పనిలేదు.. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా చిత్తశుద్దితో పని చేస్తానని చెప్పేశారు.

ఇప్పుటు కొడాలి నాని వంతు వచ్చింది. ఆయన సీటు కూడా చిరిగిందని అంటున్నారు. గుడివాడలో ఏ సర్కిల్స్ చూసినా సీన్ అర్థం అయిపోతుంది. గుడివాడ వైసీపీ అభ్యర్థి అని నియోజకవర్గంలో హనుమంతురావు ఫ్లెక్సీలు వెలిశాయి. జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడుగా ఉన్న హనుమంతురావు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఈ ఫ్లెక్సీలు పెట్టారు. పుట్టినరోజు గిఫ్ట్ గా అధిష్టానం నుంచి హనుమంతురావుకి స్పష్టమైన సంకేతాలు వచ్చాయని తెలుస్తోంది. అందుకే అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని సమాచారం. అయితే, గుడివాడలో టీడీపీ అభిమానుల ఆనందానికి అంతులేదు. ఇప్పుడు అక్కడ వైసీపీ గెలిచినా పర్వాలేదు కానీ.. కొడాలి నాని సీటు చిరిగింది అదే చాలు అనుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -