Kodali Nani: కొడాలి నానిలో ఏకంగా ఇంత మార్పా.. చిరంజీవిని ప్రశంసిస్తూ అలాంటి కామెంట్లు చేశారుగా!

Kodali Nani: రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ విధంగా మాట్లాడుతారో అన్నది వాళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటే సందర్భాన్ని బట్టి స్నేహితులే శత్రువులై పోతుంటారు. అవసరం వస్తే శత్రువులే ఆప్తమిత్రులు అయిపోతారు. ఇప్పుడు అలాంటి ఘటన ఒకటే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జరిగింది. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి పై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని గతంలో చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. చిరంజీవిని ఏకంగా పకోడీగాళ్లు అనటంతో అటు చిరంజీవి ఫ్యాన్స్, ఇటు జనసేన ఫ్యాన్స్ కూడా కొడాలి నాని పై తీవ్రంగా మండిపడ్డారు.

అలాంటి కొడాలి నాని మంగళవారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కృష్ణాజిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి చిరంజీవి అభిమానులకు పంచారు. ఆపై చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చారు. చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలంటూ చాలెంజ్ చేశారు. నేను శ్రీరామ అన్నా టీడీపీ, జనసేన పార్టీలకు బూతు మాటలుగా వినబడుతున్నాయి. నేనేం మాట్లాడానో నాకు తెలుసు, చిరంజీవికి తెలుసు, ఆయన అభిమానులకు తెలుసు.

 

రాజకీయంగా చిరంజీవిని విమర్శిస్తే ఏం జరుగుతుందో కూడా తనకు తెలుసు అన్నారు. జగన్ గురించి మాట్లాడితే మాత్రం ఎవరినైనా చీల్చి చండాడుతానని.. ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన చిరంజీవిని విమర్శించే అంత సంస్కారహీనుడని తాను కాదని చెప్పుకొచ్చారు కొడాలి నాని. చిరంజీవికి తనకి మధ్యలో ఆగాధం సృష్టించాలని అటు టీడీపీ ఇటు జనసేన కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ప్రజారాజ్యం తరపున తన కార్యాలయం మీదుగా ర్యాలీ చేస్తున్నప్పుడు చిరంజీవికి చేతులెత్తి నమస్కారం పెట్టానని తెలిపారు.

 

అయితే చిరంజీవి గారు ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్లే ఇండస్ట్రీలో డాన్స్, ఫైట్లు రాని పకోడీ గాళ్ళకి కూడా సలహాలు ఇవ్వాలని చెప్పుకొచ్చారు కొడాలి నాని. తన వెంట ఉన్న వ్యక్తులలో 60 శాతం మంది చిరంజీవి అభిమానులే అంటూ చిరంజీవిని ఓ రేంజ్ లో పొగిడేసారు నాని. అయితే నాని లో వచ్చిన ఈ మార్పు కి సొంత పార్టీ వారు సైతం అవాక్కవుతున్నారు. అంతలోనే ఇంత మార్పుకి కారణమేమిటా అంటూ ఆరాలు మొదలుపెట్టారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -