Kodali Nani: చిరంజీవి ఫ్యాన్స్ దెబ్బకు తలదించిన కొడాలి నాని.. అందుకే ఇలా కామెంట్స్ చేశారా?

Kodali Nani: మెగాస్టార్ చిరంజీవి వైసిపి ప్రభుత్వం గురించి చేసినటువంటి వ్యాఖ్యలపై వైఎస్ఆర్సిపి నేతలు స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవికి భారీ స్థాయిలో కౌంటర్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని సైతం చిరంజీవిని పకోడీ గాళ్లు అంటూ విమర్శిస్తూ కామెంట్ చేశారని తీవ్రస్థాయిలో చిరంజీవి అభిమానులు నాని పై విమర్శలు కురిపించారు.అయితే తాజాగా చిరంజీవి గురించి నాని మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గుడివాడలో జరిగినటువంటి పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నటువంటి ఈయన చిరంజీవిపై అమితమైన ప్రేమను కనబరిచారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ తాను చిరంజీవిని ఎప్పుడూ కూడా విమర్శించలేదని అయితే తాను శ్రీరామ అన్న టిడిపి జనసేన పార్టీ నాయకులు మాత్రం పెద్ద బూతుల దానిని పెద్దది చేసి చూస్తారు అంటూ నాని తెలిపారు.

 

చిరంజీవి ఎవరి జోలికి వెళ్ళరు అలాంటి వ్యక్తిని విమర్శించే అంత సంస్కారహీనుడిని తాను కాదు అంటూ నాని వ్యాఖ్యానించారు. నేను చిరంజీవి గారి పట్ల విమర్శలు చేశానని మొరిగే టిడిపి జనసేన నాయకులు ఆధారాలతో సహా బయటపెట్టాలని నాని తెలియజేశారు. చిరంజీవి గారిని విమర్శిస్తే రాజకీయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో తనకు తెలుసని ఈయన తెలిపారు.

 

ఇక చిరంజీవి గారు రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడిపించాలో సూచనలు చేసినప్పుడు ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది డాన్స్ నటన రానటువంటి పకోడీగాల్లు ఉన్నారు వాళ్లకు కూడా ఇలాంటి సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుందని తాను ఆరోజు మాట్లాడానని అయితే ఈ విషయాన్ని వైసిపి జనసేన వారికి ఆసరాగా చేసుకొని చిరంజీవికి నాకు మధ్య అగాథం సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని నాని ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -