Komati Reddy Venkata Reddy: మునుగోడులో కాంగ్రెస్ కు షాక్.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం లేనట్లే..

Komati Reddy Venkata Reddy: మునుగోడు ఉపఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామ చేయకముందు మునుగోడుపై దృష్టి పెట్టింది. మునుగోడులో నేతలను అప్రమత్తం చేసింది. ఎన్నికల షెడ్యూల రాకముందే మునుగోడులో కాంగ్రెస్ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి నేతలను యాక్టివ్ చేశారు. మునుగోడులో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీకి కీలకంగా మారింది. ఆ పార్టీ నేతలకు ఇది ఒక అగ్నిపరీక్షగా మారింది. దీంతో రేవంత్ రెడ్డి ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ప్రచారానికి వస్తారా.. లేదా అనే దానిపై గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆయన ప్రచారానికి వస్తారని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర పార్టీ నేతలందరూ చెబుతున్నారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. మరికొద్దిరోజులు మాత్రమే మునుగోడు ప్రచారానికి సమయం ఉంది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం అసలు మునుగోడు వైపు చూడటం లేదు. ప్రచారానికి రావాలని స్థానిక నేతల నుంచి ఆహ్వానాలు వెళ్తున్నా… ఆయన మాత్రం రావడం లేదు.

కానీ ఈ నెల 15న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు. తిరిగి మునుగోడు ఉపఎన్నికల పోలింగ్ ముగిసన తర్వాతనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిరిగి విదేశీ పర్యటన నుంచి రానున్నారు. దీంతో మునుగోడు ఉపఎన్నికల ప్రచారానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరుకారని తేలిపోయింది. కానీ టీపీపీసీ నేతలు మాత్రం ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఏఐసీసీ మంతనాలు జరుపుతారని, మునుగోడు ప్రచారానికి ఆయన వస్తారని చెప్పుకొచ్చారు.

ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారానికి వస్తారని చెప్పుకొచ్చారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ డిమాండ్లపై భట్టి విక్రమార్క స్పందించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాలనే ప్రతిపాదనలు కాంగ్రెస్ పార్టీలో ఏమీ లేవని తెలిపారు. తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరపున పోటీలో ఉన్నారు. తమ్ముడికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఇష్టం లేకనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారంలోకి రావడం లేదని, ఏదోక సాకులు చెబుతున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రియాంకగాంధీని కలిసిన సమయంలో కూడా మునుగోడు ప్రచారానికి వెళతారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. కానీ తమ్ముడికి మద్దతు ఇవ్వడం కోసమే వెంకటరెడ్డి ప్రచారానికి వెళ్లడం లేదు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -