KTR: రాబందుల రాజ్యమొస్తే.. రైతుబంధు రద్దవడం గ్యారెంటీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

KTR: టీఆర్ఎస్ నేత మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ చేసిన ఆరు పథకాల మీద ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. మామూలుగానే కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. రాజకీయాలకు సంబంధించిన ఏ వార్త వచ్చినా దానికి అనుగుణంగా స్పందిస్తూ ఉంటారు. అయితే తాజాగా సిడబ్ల్యుసి మీటింగ్ తర్వాత కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాల మీద మండిపడ్డారు కేటీఆర్. కాంగ్రెస్ వాళ్ళ కపట కథలు, కుల గోత్రాలు తెలంగాణ గడ్డలో అందరికీ తెలుసని, కల్లబొల్లి గ్యారెంటీలు ఇక సెలవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాలకేయుల కాలం వస్తే కరెంటు కోతలు, కటిక చీకట్లు గ్యారంటీ అంటూ విమర్శించారు. అలాగే రాబందుల రాజ్యం వస్తే రైతుబంధు రద్దవుడం గ్యారెంటీ, బకాసురులు గద్దెనెక్కితే రైతు బీమా ధీమా గల్లంతవ్వడం గ్యారంటీ అంటూ ట్వీట్ చేశారు. అలాగే మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంటే గతి అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అర్థ శతాబ్దపు పాలనంత మోసం, వంచన ద్రోహం అని విమర్శించారు.

కర్షకుడి కష్టం తెలియనోళ్లకు సీట్ ఇస్తే అన్నదాత ఆగమైపోతాడని, పరిపాలన చేతకాని చేవలేని వాళ్లకు పగ్గాలు ఇస్తే పల్లె పల్లెన మళ్ళీ పల్లేరు మొలవటం గ్యారెంటీ అన్నారు. పనికిమాలిన వాళ్ళు పవర్ లోకి వస్తే పరిశ్రమలు పారిపోతాయని, బుద్ధి కుశలత లేని వాళ్ళకు చోటిస్తే భూముల ధరలు పడిపోతాయని చెప్పారు. థర్డ్ గ్రేడ్ నాయకులను నమ్ముకుంటే ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం అధమ స్థాయికి పడిపోవటం గ్యారెంటీ.

ఆర్థిక శాస్త్రం తెలియని అరాచకులకు అవకాశం ఇస్తే ఎకానమీ యేట్లో కలవడం తధ్యమని, జోకర్లకు బ్రోకర్లకు పీఠమిస్తే పరువు ప్రతిష్టలు గంగలో కలుస్తాయని దాచి దాచి దెయ్యాలకు పెట్టేంత ఎడ్డది తెలంగాణ కాదని, ఈనగాచి నక్కల పాలు చేసే అంత అమాయక నేల తెలంగాణ కాదంటూ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మరి దీని మీద కాంగ్రెస్ వాళ్ళు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -