KTR: వైరల్ అవుతున్న కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

KTR: తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తరచూ విమర్శల పాలు అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్నిసార్లు తడబడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఈయన పట్ల విమర్శలను వెల్లువెత్తెలా చేస్తున్నాయి. బారాస నేతలు తరచూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల విమర్శల వర్షం కురిపిస్తూనే ఉంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బారాస అధినేత మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుర్తించారు.

 

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడం మద్యంతర బడ్జెట్ విషయంపై కేటీఆర్ స్పందించారు. రాష్ట్రానికి మధ్యంతర బడ్జెట్ ఏమీ రాలేదని కేటీఆర్ వెల్లడించారు. మధ్యంతర బడ్జెట్ విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. అయితే ఈ అన్యాయాన్ని చూస్తూ రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారే తప్ప ప్రశ్నించడం లేదని కేటీఆర్ తెలిపారు.

ఇలా రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ఈయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి ఒక్క మాట కూడా వ్యతిరేకంగా ఈయన మాట్లాడలేదు ఇలా మాట్లాడకుండా ఉండడం వెనుక కారణం ఏంటి ఆయన బిజెపి అధినేతలకు భయపడుతున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు పణంగా పెడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. కృష్ణ బోర్డును రాష్ట్రానికి అప్పగించి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రశ్నించిన తీరు ప్రస్తుతం సంచలనంగా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -