Lakshmi Manchu: ప్రభాస్ తల్లిగా నేను ఎలా చేస్తా.. మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు?

Lakshmi Manchu: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో బాహుబలి ఒకటి. బాహుబలి సినిమాలో ప్రభాస్ రానా పాత్రలతో పాటు శివగామి పాత్ర కూడా ఎంతో హైలైట్ అయింది.ఇకపోతే ఈ సినిమాలో శివగామి పాత్రలో నటించడానికి రమ్యకృష్ణతో పాటు పలువురి నటీమణులను రాజమౌళి సంప్రదించిన విషయం మనకు తెలిసిందే. ఇక శివగామి పాత్రలో నటించిన రమ్యకృష్ణ ఎంతో అద్భుతంగా నటించారు.

ఈ పాత్రలో నటించిన అందుకుగాను ఆమెకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయని చెప్పాలి.ఈ పాత్ర గురించి ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ శివగామి పాత్రలో నటించడం కోసం జక్కన్న సంప్రదించిన వారిలో మంచు లక్ష్మి కూడా ఒకరనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన మంచు లక్ష్మి ప్రభాస్ కు నేను తల్లిగా నటించడం ఏంటి అంటూ సమాధానం చెప్పారు.

ప్రభాస్ కి తల్లిగా నేను చేయాలనుకోవడం లేదు మన ఇండియాలో ఒకసారి ఒక పాత్రలో నటించామంటే అందులోనే ఉండిపోతాము.నేను ఒక పాత్ర పై డిపెండ్ కావాలనుకోవడం లేదు అంటూ ఈమె సమాధానం చెప్పారు.ఈ సినిమాలో ఈ పాత్ర అంత మంచి హిట్ అయిన తర్వాత నేను ఎంతో గర్వపడ్డాను కానీ ఈ సినిమాలో నేను నటించకపోవడం మంచిదైందని భావించాను అంటూ మంచు లక్ష్మి తెలిపారు.

బాహుబలి సినిమాలో శివగామి పాత్ర ఎంతో ప్రత్యేకమైనది కావచ్చు కానీ ఆ పాత్రకు నేను కరెక్ట్ కాదు. నేను నా సినీ కెరియర్, లైఫ్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని రిజెక్ట్ చేశానని ఈ సందర్భంగా మంచు లక్ష్మి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కానీ ఐరేంద్రి లాంటి క్యారెక్టర్ ఇంకొకటి రాదు రాబోదు కూడా అంటూ ఈ సందర్భంగా మంచు లక్ష్మి యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పాత్ర గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -