ఈ వ్యూహాలు యాత్రలు ఎందుకు జగన్…. నీ పాలన మీద నమ్మకం లేదా…?

2019 ఎన్నికల్లో నవరత్నాలు పేరుతో ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సీఎం అయ్యాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్నారు తప్ప మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ఒక్క హామీని కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలో 100% అమలు చేయలేకపోయారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు చేసేది ఏంటంటే ఒక చేత్తో ఇవ్వడం మరో చేత్తో లాగేసుకోవడం. ఈ సంక్షేమ పథకాలు ఇచ్చేది కూడా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడితే తప్ప జరగదు.

ఈ నాలుగేళ్ల వైసిపి పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ఊరిలోకి వెళ్ళినా తెలుస్తుంది… ఏ రోడ్డు చూసిన తెలుస్తుంది. సామాన్య మధ్య తరగతి ప్రజలను ఎవ్వరిని కదిపిన ఈ వైసీపీ పాలన వైఫల్యాన్ని పూసగుచ్చినట్టు చెబుతారు. అయితే 2019 ఎన్నికల ముందు సానుభూతి పేరుతో వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రని యాత్ర సినిమాగా రూపొందించి ఓటర్లను ప్రభావితం చేసారు. అయితే అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పాలన చేసిన కూడా జగన్ కి తన పాలన మీద తనకు నమ్మకం లేదనుకుంటా. మళ్లీ ఇప్పుడు 2024 ఎన్నికలు టార్గెట్ గా ఫెడ్ అవుట్ అయిపోయిన దర్శకుడు రాంగోపాల్ వర్మని నమ్ముకుని చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వ్యూహం అనే సినిమాని తీశారు. అలాగే జగన్ పాదయాత్రను జనానికి రుద్దే విధంగా యాత్ర 2 పేరుతో మరో సినిమాను తీసి ఎన్నికల ముందు విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

వైసిపి మీటింగుల లోనూ, ప్రజాసభల్లోనూ వై నాట్ 175 అంటూ ప్రగల్బాలు పలుకుతున్న జగన్ దిగజారిపోయి ఈ సినిమాల మీద ఆధారపడటం చూస్తుంటే తన పాలన మీద తాను అందిస్తున్న సంక్షేమ మీద నమ్మకం లేదనిపిస్తుంది. అలాగే జనసేన టిడిపి కూటమి ఆంధ్రప్రదేశ్లో బలపడిందనే వాస్తవం. తాజాగా పలు సర్వేలు కూడా దీని స్పష్టం చేశాయి. ఇవన్నీ చూసి ఏం చేయాలో తోచని జగన్మోహన్ రెడ్డి చివరికి సినిమాల మీద ఆధారపడుతున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -