Prabhas: ఇతర భాషల నటులు సైతం అసూయపడే కీర్తి ప్రభాస్ సొంతం.. ఇలాంటి హీరో మళ్లీ పుడతారా?

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు ప్రపంచం మొత్తం తిరిగి చూస్తుంది అంటే అందుకు కారణం మన ప్రభాస్. బాహుబలి తో ప్రపంచం మొత్తాన్ని టాలీవుడ్ వైపు చూసే లాగా చేసిన ఘనత ప్రభాస్ ది. అభిమానులు అందరూ రెబల్ స్టార్ అని, డార్లింగ్ అని పిలుచుకునే ప్రభాస్ ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి,ఆ పాత్రని 10 కాలాలపాటు ప్రేక్షకులు గుర్తుంచుకునేలా చేయగలిగే కెపాసిటీ కలిగిన వ్యక్తి.

అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు. అసలు ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో ఏం ముహూర్తాన ఇండస్ట్రీలో అడుగు పెట్టాడో కానీ మళ్లీ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కేవలం తెలుగు అగ్ర హీరోస్ నే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమకే ఆగ్ర హీరో ప్రభాస్. ప్రభాస్ నుంచి సినిమా వస్తుంది అంటే తెలుగు అభిమానులే కాదు ప్రపంచం మొత్తం ఆ సినిమాపై క్యూరియాసిటీ చూపిస్తుంది.

ఇంతటి ఘనత ప్రభాస్ ఓవర్ నైట్ లో సంపాదించలేదు. కొన్ని సంవత్సరాల కష్టానికి ఫలితం ఈ సక్సెస్. ఒకప్పటి టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా ఈశ్వర్ తోనే మంచి మార్కులు కొట్టేశాడు ప్రభాస్. తర్వాత వర్షం, పౌర్ణమి, బుజ్జి గాడు, బిల్లా, డార్లింగ్, చక్రం వంటి అన్ని జోనర్లలోని సినిమాలని కవర్ చేసేసాడు ప్రభాస్.

తెలుగు చిత్రసేను కి మంచి హీరో దొరికాడు అని అందరూ భావించే లాగా చేశాడు కానీ వాళ్ళకి అప్పటికి తెలియదు అతను భారతీయ చిత్ర పరిశ్రమనే శాసించబోతున్నాడని. బాహుబలి తో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ప్రభాస్ సాలార్ మూవీ తో డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, సాలార్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఆకాంక్షిద్దాం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -