‘Leo’ Title Controversy: లియో టైటిల్ సెటిల్మెంట్.. నాగవంశీ ఇచ్చిన డబ్బుల లెక్క తెలిస్తే షాకవ్వాల్సిందే!

‘Leo’ Title Controversy:  నందమూరి బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరి, మాస్ మహారాజా రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావుకి గట్టి పోటీ చేస్తూ అదే రోజున రిలీజ్ కి సిద్ధమైంది తమిళ డబ్బింగ్ మూవీ లియో. విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన చిత్రమిది. తళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా నటించగా సంజయ్ దత్, అర్జున్ నెగటివ్ రోల్స్ చేస్తున్నారు. విజయ్ దళపతి, లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

అయితే ఈ సినిమా తెలుగు వర్షన్ కి సంబంధించి వివాదం నెలకొంది. తెలుగులో లియో పేరుతో ఆల్రెడీ ఒక టైటిల్ డీ స్టూడియో పేరుతో రిజిస్టర్ అయ్యి ఉంది. దీంతో చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడం పట్ల వారు అభ్యంతరం తెలిపారు. తెలుగు వెర్షన్ నిర్మాత నాగవంశీని కాకుండా వారు నేరుగా కోర్టుమెట్లు ఎక్కారు. దాంతో సినిమా రిలీజ్ డేట్ పై సస్పెన్స్ నెలకొంది. అయితే నాగవంశీ మాట్లాడుతూ కేసు వేసిన వ్యక్తి తో మాట్లాడి సెటిల్ చేసుకోవడం జరిగింది.

కోర్టు ఈ పిటిషన్ ను బుధవారం కొట్టివేసింది. రిలీజ్ కు ఎలాంటి అభ్యంతరాలు లేవు. రిలీజ్ కి ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ కూడా చేసిందని, తెలుగులో కూడా అక్టోబర్ 19న ఉదయం ఏడు గంటల నుంచి షో స్టార్ట్ కాబోతున్నట్లు చెప్పుకొచ్చారు నిర్మాత నాగ వంశీ. ఇక కేసు వేసిన వ్యక్తికి 25 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకున్నట్లు సమాచారం.

అయితే ఇది తెలుగు నిర్మాత నాగ వంశీ ఇచ్చారా లేదంటే తమిళ నిర్మాతలే ఇచ్చారా అనేది తెలియని విషయం. నాగ వంశీ ఈ సినిమాని 16 కోట్లకి కొనుగోలు చేశారట. దర్శకుడికి హీరోకి ఉన్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని అంత భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశారట నాగ వంశీ. మరి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు తిరిగి వస్తుందో వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -