CM Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు… ఎంత ఖర్చు పెట్టారో తెలుసా…?

CM Jagan: సంక్రాంతి పండుగను రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు సొంతూరు తరలి వెళ్లి కుటుంబ సభ్యులతో అందరూ ఆనందంగా గడిపారు. ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా అమరావతి రైతులతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు ఆలియాలకు వెళ్లారు. కొందరైతే ప్రజలతో కలిసి సంక్రాంతి వేడుకల్లో మునిగిపోయారు.

 

అయితే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలు చాలా ఖరీదైన వేడుకలు. తాడేపల్లి లోని సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే వేడుకలు ప్రజల మధ్యలో లేదా ఏదైనా ఆలయంలో జరిగితే చాలా బాగుండేది. కానీ ఈ వేడుకల కోసం జగన్మోహన్ రెడ్డి నివాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ వేశారు. తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామిని జగన్మోహన్ రెడ్డి కోసం తాడేపల్లి నివాసానికి తీసుకువచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నట్లు ప్రచార అర్బటానికి దిగారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో వైయస్ భారతి జగన్ కూడా ఒక్కసారి కూడా తిరుపతికి వెళ్లిన దాఖలాల లేవు. స్వతహాగా సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబం క్రైస్తవ మతానికి చెందిన ఒక ప్రజానాయకుడిగా అన్ని మతాలను గౌరవించాల్సిన బాధ్యత వీరిపై ఉంది. శ్రీవారికి పట్టు వస్త్రాలు ఎప్పుడు కూడా దంపతులు సమర్పించాలి. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య ఈ కార్యక్రమానికి ఏనాడు హాజరు కాలేదు. కానీ సంక్రాంతి వేడుకల్లో మాత్రం జగన్ పక్కన భారతి కనిపించారు. ఇది చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ షాక్ అయ్యారు. ఇది కేవలం ఆలయం సెట్టింగ్ కాబట్టే భారతి హాజరయ్యారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి భజన కార్యక్రమాలు కూడా జరిగాయి. వేద పండితులు జగన్మోహన్ రెడ్డి దంపతులకు వేద ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థప్రసాదాలు కూడా ఇచ్చారు.

 

ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్ ఏంటంటే ఈ వేడుకల కోసం అయినా ఖర్చు. జగన్ నివాసంలో సంక్రాంతి వేడుకల కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఇది చూసి అందరూ బాగా షాక్ తింటున్నారు. ప్రజల సొమ్ముతో ఇలా ఆర్భాటాలు చేయడం ఎంతవరకు తగను అంటూ ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఈ రెండు కోట్ల రూపాయలు ఏదో సంక్రాంతి వేడుకల కోసం రాష్ట్రానికి ఇస్తే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేవారు కదా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అసలే లోటు బడ్జెట్ లో జీతాలు ఇవ్వడానికి కూడా లేవని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇలా వృధా ఖర్చులు చేయడం ఎందుకు దీనికి ఎవరు సమాధానం చెబుతారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -