Mike Tyson: లైగర్ సినిమాలో కనిపించిన మైక్ టైసన్ ఎన్నిసార్లు జైలుకు వెళ్లాడో తెలుసా?

Mike Tyson: మైక్ టైసన్ మాజీ ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్. ఈయన 1985లో బాక్సింగ్ లోకి అడుగుపెట్టి 1986లో ట్రివర్ బెర్బిక్ ను ఓడించి హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ ను గెలుచుకొని రికార్డ్ సృష్టించాడు. టైసన్ కెరీర్లో 50 విజయాలు సాధించగా అందులో 44 నాకౌట్ విజయాలు సాధించాడు.

మైక్ టైసన్ 2005లో రిటైర్డ్ అయ్యాడు. ఈయన 2022 లో విడుదలైన లైగర్ సినిమాలో కనిపించాడు. ఇక నిజ జీవితానికి వస్తే 1992లో టైసన్ పై అత్యాచారం నేరం రుజువైంది. ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించబడి, శిక్ష పడిన మూడు సంవత్సరాల తర్వాత పెరోల్ పై విడుదలయ్యాడు.

మైక్ టైసన్ మూడు సార్లు వివాహం చేసుకున్నాడు. ఇతనికి ఏడుగురు పిల్లలు. టైసన్ బాల్యమంతా అధికంగా నేరాలు జరిగే పరిసర ప్రాంతాల్లో నివసించాడు. చుట్టుపక్కల వాళ్లను చూస్తూ తాను కూడా చిన్నచిన్న నేరాలు చేసేవాడు. తనకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడే దాదాపుగా 38 సార్లు అరెస్టయ్యాడు.

టైసన్ లోని బాక్సింగ్ సామర్థ్యాన్ని బాబి స్టీవర్ట్ గుర్తించాడు. ఇతనికి కొంతకాలం శిక్షణ ఇచ్చి కస్ డి అమాటోకు పరిచయం చేశాడు. టైసన్ 1997లో రీమ్యాచోహ్లి ఫీల్డ్ యొక్క చెవులు కొరికినందుకు అనర్హుడు అయ్యాడు. టైసన్ జైలుకు వెళ్లడం కంటే ముందే ఇస్లాం మతంలోకి మారడం జరిగింది.

దీనిపై ఎన్నో తప్పుడు కథనాలు వచ్చిన ఎన్నడు వాటిపై స్పందించలేదు. 1997లో టైసన్ బాక్సింగ్ లైసెన్స్ ను నెవాడా స్టేట్ అథ్లెటిక్ కమిషన్ ఏకగ్రీవ వాయిస్ ద్వారా రద్దు చేయడం జరిగింది. అతనికి యుఎస్ 3 మిలియన్ల డాలర్ల జరిమానా విధించబడింది. తరువాత 1999లో దక్షిణాఫ్రికాకు చెందిన ప్రాంకోయిస్ బోథాతో జరిగిన మ్యాచ్ కోసం తిరిగి బరిలో దిగాడు. ఈ విధంగా టైసన్ నిజజీవితంలో అనేక వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన లైగర్ సినిమాలో ఈయన నటించిన సంగతి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -