TDP – YSRCP: వారు వీరయ్యారు వీరు వారయ్యారు.. 2019 2024లో పార్టీలు మార్చుకున్న అభ్యర్థులు వీళ్లే!

TDP – YSRCP: టికెట్ ఆశించి భంగపడి కొంతమంది పార్టీలు మారుతారు. పార్టీల గెలుపోటములను అంచనా వేసి మరికొంతమంది గెలిచే అవకాశం ఉందనుకునే పార్టీలో వెళ్తారు. ఇలా ప్రతీసారి జరుగుతూనే ఉంటాయి. ఏపీలో గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి ఎక్కువ వలసలు పెరిగాయి. గంటా శ్రీనివాస్, బుట్టారేణుక లాంటి అప్పటి ఎంపీలు ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు వలసలు రివర్స్ అయ్యాయి. ఇలాంటి వలసలతో పలు నియోజకవర్గాల్లో ఈసారి పోటీ ఇంట్రస్టింగ్ గా మారింది.

అలాంటి నియోజకవర్గాల్లో మొదటి స్థానం గన్నవరం. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీ చేశారు. వంశీ 993 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఏడాదిలోనే వంశీ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి గన్నవరంలో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. యార్లగడ్డ వర్సెస్ వంశీగా మారిపోయింది. ఈసారి టికెట్ వంశీకే అని అధిష్టానం తేల్చడంతో యార్లగడ్డ టీడీపీ గూటికి చేరారు. దీంతో.. ఆయనకు చంద్రబాబు ఈసారి టికెట్ ఇచ్చారు. అంటే.. గన్నవరంలో గతసారి టీడీపీ తరుఫున పోటీ చేసిన వంశీ ఇప్పుడు వైసీపీ తరుఫున.. గతసారి వైసీపీ తరుఫున పోటీ చేసిన యార్లగడ్డ ఇప్పుడు టీడీపీ తరుఫున పోటీ చేస్తున్నారు.

మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా పోటీ ఇంట్రస్టింగ్ గా ఉంది. గత ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసిన దేవనేని అవినాష్ ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. కాబట్టి గతంలో గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేసిన అవినాష్ ఇప్పుడు విజయవాడ తూర్పు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అంతేకాదు.. గతంలో వైసీపీ నుంచి పోటీ చేసిన చాలా మంది ఇప్పుడు కూటమి అభ్యర్థులుగా ఉన్నారు. గత ఎన్నికల్లో మచిలీపట్నం లోక్‌సభ నుంచి వైసీపీ తరుఫున పోటీ చేసిన బాలశౌరి ఈసారి అదే స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా ఉన్నారు. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలిచిన కేశినేని నాని ఈసారి వైసీపీ అభ్యర్థిగా అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, నూజివీడు నుంచి కొలుసు పార్థసారధి టీడీపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. కానీ, గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున పోటీ చేసి గెలిచారు.

గత ఎన్నికల్లో కీలకంగా అనిపించిన చాలా మంది ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి గత ఎన్నికల్లో 13 ఓట్ల మెజార్టీతో గెలిచిన మల్లాది విష్ణుకు ఈసారి జగన్ టికెట్ ఇవ్వలేదు. గతసారి వైసీపీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి పోటీ చేసిన పేర్ని నాని ఈసారి తప్పుకొని తన కుమారుడు పేర్ని కిట్టును రంగంలోకి దించారు. గత ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ నేత దేవినేని ఉమాకి ఈసారి చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. గతసారి విజయవాడ ఎంపీ వైసీపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న పీవీపీ ఈ సారి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

పోటీ చేసిన స్థానాలతో పాటు.. ప్రత్యర్థులకు కూడా మారకుండా ఉన్న స్థానాలు ఈసారి చాలా తక్కువగా ఉన్నాయి. జగ్గయ్యపేట, నందిగామ నుంచి శ్రీరాం తాతయ్య, సామినేని ఉదయభాను, తంగిరాల సౌమ్య, మొండితోక జగన్మోహనరావు గతసారి పోటీ చేశారు. ఇప్పుడు వారే ఉన్నారు. జనసేన అవనిగడ్డ అభ్యర్థిగా మండలి బుద్ద ప్రసాద్ పేరు ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ తరుఫున పోటీ చేశారు. కానీ, ఈసారి జనసేన తరుఫున పోటీ చేస్తారు. ఏదైనా ఆయనే కూటమి అభ్యర్థి. వైసీపీ తరుఫున ఇక్కడ నుంచి సింహాద్రి రమేశ్‌ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయనే పోటీ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -