CM Jagan: వారికి తక్కువ వడ్డీకే రుణాలు.. సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే!

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎన్నో రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారు ప్రతి గ్రామంలోనూ ఆర్బికేలను ఏర్పాటు చేసే రైతులకు మద్దతు ధరలో పంటను కొనుగోలు చేయడం అలాగే ఎరువులను మందులను సబ్సిడీ రూపంలో రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇలా ఆర్బికేల ద్వారా ఇప్పటికే రైతులకు ఎంతో మేలు కలిగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసి రైతుల కోసం మరొక నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సహకార శాఖపై సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి,వ్యవసాయ సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వంటి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని తెలియజేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి అంటే వ్యవసాయం, మహిళల ఆర్థిక స్థితిగతులు బలంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి తెలియచేశారు.

 

ఈ క్రమంలోనే వ్యవసాయ కార్యకలాపాలకు మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాలకు అత్యంత తక్కువ వడ్డీకే రుణాలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడంతో వారిని ఆర్థికంగా ముందుకు నడిపించగలమని జగన్ పిలుపునిచ్చారు. ఈ లక్ష్యసాధనలో భాగంగా ఆర్బికెలతోపాటు సహకార బ్యాంకులు, ఆప్కాబ్, పీఏసీఎస్ లు భాగస్వామ్యం కావాలని తెలిపారు. ఈ విధంగా రైతుల వ్యవసాయం కోసం మహిళల స్వయం ఉపాధికి తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వబోతున్నట్లు తెలిపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రుణాలకు ఆర్బికే ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -