Madhavi Latha: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ను ఎవ్వడూ దేకడు.. మాధవీలత సంచలన వ్యాఖ్యలు వైరల్!

Madhavi Latha: తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ప్రచారం అవుతున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం ఏడవ సీజన్ ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఇక ఈ షో పట్ల కొందరు పాజిటివ్ అభిప్రాయాన్ని కలిగి ఉండగా మరికొందరు నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలకు గుర్తింపు సంపాదించుకొని కెరియర్ పరంగా సక్సెస్ సాధించగా మరికొందరు లైఫ్ కూడా పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారు అని చెప్పాలి.

ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమం పేరు ఎత్తితేనే ఇంత ఎత్తున ఎగిరిపడే మాధవి లత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఒక నెటిజన్ ఈమెతో చాట్ చేస్తూ మీరు బిగ్ బాస్ కార్యక్రమం చూస్తారా అంటూ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు మాధవి లత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ కార్యక్రమం అనేది ఒక కమర్షియల్ షో. ఈ షో మొత్తం డబ్బు మీదే రన్ అవుతూ ఉంటుందని ఈమె తెలియజేశారు.

ఇక ఈ కార్యక్రమంలో సామాన్యమైన జనాలను పెడితే ఎవరు దేకడు. వారికి ఎవరి కావాలో వాళ్లనే పెట్టుకుంటారు అలాంటి వారిని పెట్టుకుంటే అందరు దేకతారు.. అంతేకాదు ఈసారి సీజన్ కి చాలామంది స్టార్ సెలబ్రిటీలకు ఈ ఆఫర్ ఇచ్చినప్పటికీ చాలామంది ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. డబ్బు కన్నా మాకు మా పరువే ముఖ్యమంటూ చాలామంది ఈ కార్యక్రమానికి రావడానికి ఇష్టపడటం లేదని మాధవి లత తెలియజేశారు.

నన్ను బలవంతం చేయొద్దు దేకే వాళ్ళని దేకండి అంటూ మాధవి లత ఘాటుగా రిప్లై ఇవ్వడంతో ఈమె చేసినటువంటి కామెంట్స్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ గురించి చెప్పిందని క్లియర్ గా అర్థమవుతుంది. ఇక మొదటి నుంచి మాధవి లత బిగ్ బాస్ కార్యక్రమం అంటేనే పూర్తిస్థాయిలో వ్యతిరేకత చూపిస్తున్న సంగతి మనకు తెలిసింది

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -